ప్ర‌జ‌ల‌ కు దూర‌మైతే.. నాకు భారం: తేల్చేసిన చంద్ర‌బాబు

ప్ర‌జ‌ల‌కు దూర‌మైన నాయకులు, ప్ర‌జ‌ల‌తో సంబంధాలు లేని నాయ‌కులు.. త‌న‌కు కూడా భార‌మేన‌ని చంద్ర‌బాబు తేల్చేశారు.

Update: 2026-06-06 18:38 GMT

ప్ర‌జ‌ల‌కు దూర‌మైన నాయకులు, ప్ర‌జ‌ల‌తో సంబంధాలు లేని నాయ‌కులు.. త‌న‌కు కూడా భార‌మేన‌ని చంద్ర‌బాబు తేల్చేశారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని ప‌దే ప‌దే చెబుతున్నా కొంద‌రు నాయ‌కులు పెడ చెవిన పెడుతున్నార‌ని దీనిని ఏమాత్రం స‌హించ‌బోన‌ని తేల్చి చెప్పారు. కార్య‌క‌ర్త‌ల‌ను న‌డిపించ‌డంతోపాటు.. నాయ‌కులు కూడా ముందుకు న‌డ‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌తి విష‌యాన్ని ప్ర‌జ‌ల ముందుకు తీసుకువెళ్లాల‌ని సూచించారు.

అన్నీ స‌ర్వేలే!

పార్టీలో అయినా.. ఇత‌ర రూపాల్లో అయినా ప‌ద‌వులు ద‌క్కేది కేవ‌లం స‌ర్వేల‌తోనేన‌ని చంద్ర‌బాబు చెప్పా రు. ఎట్టి ప‌రిస్థితిలో సిఫార‌సుల‌కు ప‌నులు జ‌ర‌గ‌వ‌ని తెలిపారు. ప‌ద‌వుల కోసం ఎదురు చూసే వారు.. ముందు త‌మ ప‌నితీరును మెరుగు ప‌రుచుకోవాల‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇటు పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి అటు ప్ర‌జ‌ల నుంచి కూడా స‌ర్వేల ద్వారా నాయ‌కుల ప‌నితీరు తెలుసుకుని ఆ త‌ర్వాతే.. ప‌ద‌వులు ఇస్తామ‌న్నారు.

ప‌నిచేయ‌ని వారు వెళ్లిపోవ‌చ్చ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెప్పారు. పార్టీలో ఉండాల‌ని అనుకునేవా రు.. ఖ‌చ్చితంగా ప‌నిచేయాల‌న్నారు. అలా చేయని వారు గౌర‌వంగా బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌ని సూచించా రు. ప‌నిచేయ‌ని వారిని తాము కూడా దూరం పెడ‌తామ‌న్నారు. ఈ విష‌యంలో మొహ‌మాటాల‌కు తావు లేద‌న్నారు. తాజాగా శ‌నివారం మంగ‌ళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌టిం చారు. ఈ సంద‌ర్భంగా కాఫీ క‌బుర్లు కార్యక్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు.

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్రాధాన్యం..

పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఈ విష‌యంలో ఎవ‌ర‌నీ ఉపేక్షించేది లేద‌న్నారు. ఎవ‌రైనా పార్టీ నియ‌మాల‌కు క‌ట్టుబ‌డి ప‌నిచేయాల‌ని సూచించారు. ఇటీవ‌ల మ‌రోసారి వివాదాస్ప‌ద‌మైన కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ.. ఎమ్మెల్యే-ఎంపీల మ‌ధ్య స‌ఖ్య‌త అత్యంత అవ‌స‌ర‌మ‌ని సూచించారు. ఎవ‌రూ కూడా పార్టీలైన్‌ను దాట‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పారు. అన్ని వ‌ర్గాల నుంచి అభిప్రాయాల‌ను తీసుకున్న త‌ర్వాతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌ని తెలిపారు.

Tags:    

Similar News