రిపీటెడ్ సక్సెస్...బాబు పిలుపు !

తెలుగుదేశం పార్టీకి రిపీటెడ్ సక్సెస్ అన్నది ఎన్టీఆర్ హయాంలో మాత్రమే ఒకసారి జరిగింది.

Update: 2026-05-28 04:13 GMT

తెలుగుదేశం పార్టీకి రిపీటెడ్ సక్సెస్ అన్నది ఎన్టీఆర్ హయాంలో మాత్రమే ఒకసారి జరిగింది. 1983లో గెలిచిన టీడీపీ 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించింది. ఆ తరువాత 1989లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ నాయకత్వంలోనూ టీడీపీ ఓటమి పాలు అయింది. అయితే గిర్రున అయిదేళ్ళు తిరిగేసరికి 1994లో టీడీపీకి విజయం వరించింది. ఇక చంద్రబాబు సీఎం అయ్యాక తానుగా సొంతంగా బరిలోకి దిగి 1999 ఎన్నికల్లో గెలిచారు. అయితే ఆ విజయాన్ని ఆయన 2004లో కంటిన్యూ చేయలేకపోయారు. ఇక 2009లో రిపీటెడ్ డిఫీట్ అయితే టీడీపీకి దక్కింది.

విభజన ఏపీలోనూ :

అదే రకమైన పరిస్థితి విభజన ఏపీలోనూ జరుగుతూ వస్తోంది. 2014 లో టీడీపీ మంచి మెజారిటీతో గెలిచింది. కానీ 2019 ఎన్నికలు వచ్చేసరికి ఓటమి పాలు అయింది. అయిదేళ్ళ పాటు కేవలం 23 సీట్లకే పరిమితం అయి అనేక పోరాటాలు చేసింది. 2024లో బంపర్ విక్టరీ కొట్టింది. కూటమి ద్వారా విజయం లభించినా అందులో టీడీపీకి కనీ వినీ ఎరుగని సీటు ఓటు షేర్ దక్కడం విశేషంగానే చూస్తున్నారు. టీడీపీ 144 సీట్లలో పోటీ చేస్తే 135 సీట్లలో గెలవడం అన్నది గ్రేట్ అచీవ్ మెంట్ అని చెబుతారు. మరి 2024 లో లభించిన ఈ గ్రాండ్ సక్సెస్ 2029 లో కంటిన్యూ కావాలని అంతా కోరుకుంటున్నారు.

టార్గెట్ అదే అంటూ :

మహానాడులో చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. టీడీపీకి 2024 లో దక్కిన విజయం 2029 లో దక్కాలని ఆయన పార్టీ క్యాడర్ ని కోరారు. ఇప్పటి నుంచే క్యాడర్ కష్టపడాలని ఆయన సూచించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘన వీజయం సాధించాలని కూడా బాబు కోరారు. ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసే టీడీపీకి విజయాలు కూడా అలాగే దక్కాలని బాబు ఆకాంక్షించారు.

ఎన్నిక ఏదైనా సరే :

టీడీపీ బరిలోకి దిగాలి కానీ ఎన్నిక ఏదైనా సరే విజయం మాత్రం పసుపు పార్టీదే అవాలని బాబు గట్టిగానే చెప్పారు. అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండూ బ్యాలెన్స్ గా చేసుకుంటూ వస్తున్న టీడీపీకి రిపీటెడ్ సక్సెస్ అన్నది కావాలని ఆయన క్యాడర్ కి దిశా నిర్దేశం చేశారు. అయితే ఏపీ పొలిటికల్ ట్రాక్ రికార్డు చూసినా జనాల తీర్పు చూసినా ఒక ఎన్నికల్లో గెలిచిన పార్టీని మరో ఎన్నికల్లో ఓడిస్తున్నారు. ఇది జస్ట్ ఫర్ చేంజ్ అని కూడా అంటున్నారు అయిదేళ్ళలో ఆ పార్టీ ఎన్ని మంచి పనులు చేసినా కూడా ప్రతిపక్షాన్ని తెచ్చి గద్దెనెక్కిస్తున్నారు. నేనెందుకు ఓడిపోయాను అని పార్టీల అధినేతలు అనుకునేలా జనాల తీర్పు ఉంటోంది. అంతే కాదు కనీస స్థాయిలో కూడా విపక్షంలో ఉన్న వారికి సీట్లు రావడం లేదు. ఈ విధంగా ఏకపక్ష విజయాలను కట్టబెడుతున్నారు. మరి ఈ ట్రెండ్ ని టీడీపీ మారుస్తుందా అన్నదే చర్చగా ఉంది. చంద్రబాబు అయితే మార్చాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆయన 2024 లో సీఎం గా ప్రమాణం చేసిన తరువాత డే వన్ నుంచి 2029 ఎన్నికల మీదనే ఫోకస్ పెట్టారు. ఇపుడు మహానాడులో అదే సందేశం ఇచ్చారు. మరి 2029 లో టీడీపీ కనుక రిపీటెడ్ సక్సెస్ ని అందుకుంటే మాత్రం ఏపీ పొలిటికల్ ట్రాక్ రికార్డుని చెరిపేసినట్లే. అలా చేయాలని తమ్ముళ్ళకు బాబు పిలుపు ఇస్తున్నారు. అది వారికి మేలు కొలుపు అయితే కచ్చితంగా విక్టరీ టీడీపీది అవుతుందని అంటున్నారు.

Tags:    

Similar News