వైకుంఠ పాళి వ‌ద్దు.. ప్ర‌జ‌ల‌కు బాబు పిలుపు

ఈ సంద‌ర్భంగా గ‌త 23 నెల‌లుగా రాష్ట్రంలో చేప‌ట్టిన ప్రాజెక్టులు.. జ‌రుగుతున్న అభివృద్ధి, తీసుకువ‌చ్చి న పెట్టుబ‌డుల‌ను వివ‌రించారు.

Update: 2026-05-28 20:19 GMT

రాష్ట్రంలో వైకుంఠ పాళీ ప్ర‌భుత్వం వ‌ద్ద‌ని టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. సుస్థిర ప్ర‌భుత్వం ఉంటేనే.. రాష్ట్రంలో అభివృద్ధి సాకారం అవుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం అనేక ప్రాజెక్టులు.. మ‌ధ్యస్థ ద‌శ‌లో ఉన్నాయ‌న్న చంద్ర‌బాబు.. వాటిని పూర్తి చేసి.. అభివృద్ధి ఫ‌లాలు అందించాలంటే.. దానికి సుస్థిర ప్ర‌భుత్వం ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వైకుంఠ పాళీ రాజ‌కీయాలు చేస్తే.. రాష్ట్రం లో అభివృద్ధి ఆగిపోతుంద‌ని ఉద్ఘాటించారు.

ఈ సంద‌ర్భంగా గ‌త 23 నెల‌లుగా రాష్ట్రంలో చేప‌ట్టిన ప్రాజెక్టులు.. జ‌రుగుతున్న అభివృద్ధి, తీసుకువ‌చ్చి న పెట్టుబ‌డుల‌ను వివ‌రించారు. 21 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు రాష్ట్రానికి వ‌చ్చాయ‌న్న చంద్ర బాబు 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు, ఉపాధికి మార్గం సాకారం అయింద‌న్నారు. వ‌చ్చే రెండేళ్ల‌లో మ‌రిన్ని పెట్టుబ డులు తీసుకువ‌స్తున్నామ‌న్నారు. ఉద్యోగాల‌తో పాటు.. చిన్న‌, సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మల ఏర్పాటు కూడా జ‌రుగుతోంద‌న్నారు.

త‌ద్వారా రాష్ట్రంలో ప్ర‌తి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త‌ను త‌యారు చేస్తున్నామ‌న్నారు. సంప‌ద సృష్టికి మార్గం సుగ‌మం చేశామ‌ని వివ‌రించారు. అదేస‌య‌మంలో పేద‌ల‌ను సంప‌న్నులుగా చేసేందుకు పీ-4ను తీసుకువ‌చ్చామ‌న్న ఆయ‌న‌.. ఇప్ప‌టికి 2 ల‌క్ష‌ల కుటుంబాల‌ను పేదరికం నుంచి బ‌య‌ట‌కు తీసు కువ‌చ్చామ‌ని వెల్ల‌డించారు. రాబోయే రెండేళ్లలో మ‌రింత మంది పేద‌ల‌ను సంప‌న్నులుగా తీర్చి దిద్దుతా మ‌ని చెప్పారు.

అయితే.. సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబ‌డుల క‌ల్ప‌న‌, సంప‌ద సృష్టి కొన‌సాగాలంటే.. సుస్థిర‌మైన ప్ర‌భు త్వాన్నే కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. గుజ‌రాత్ లో సుస్థిర ప్ర‌భు త్వం ఉన్నందుకే.. అక్క‌డ పారిశ్రామికంగానే కాకుండా.. అభివృద్ధి ప‌రంగా కూడా రాష్ట్రం ముందంజ‌లో ఉంద‌న్నారు. ఇదే ప‌రిస్థితి ఏపీలోనూ ఉండాల‌న్నారు. లేక‌పోతే.. న‌ర‌హంత‌కులు.. క‌బ్జాదారులు.. రాష్ట్రాన్ని మ‌రోసారి నాశ‌నం చేస్తార‌ని.. ప్ర‌జ‌ల జీవితాలు అల్ల‌క‌ల్లోలం చేస్తార‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

Tags:    

Similar News