• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబు ఈసారి టీ కాచేది...

చంద్రబాబు ఈసారి టీ కాచేది అక్కడేనట !

| ఈ విధంగా ప్రతీ నెలా బాబు పెన్షన్ పంపిణీ కోసం వెళ్తూ సరికొత్త వ్యూహాలనే అమలు చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2025-06-28 08:42 GMT

ఏపీ సీఎం చంద్రబాబు సామాజిక పెన్షన్లను పెద్ద ఎత్తున సొమ్ము పెంచడమే కాదు తానే స్వయంగా ఆయా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి మరీ వాటిని అందిస్తున్నారు. అలా 2024 జూలై నుంచి బాబు ప్రజల వద్దకే వెళ్తున్నారు. పేదల ఇంట్లో కూర్చుని వారితో కబుర్లు ఆడుతూ వారి కష్టనష్టాలను తెలుసుకుంటున్నారు.

అంతే కాదు, వారి యోగ క్షేమాలను అడుగుతున్నారు. వారి వంటింటికి వెళ్ళి తానే స్వయంగా టీ కాచి ఇస్తున్నారు. అలా చంద్రబాబు ప్రతీ నెలా పెన్షన్ పంపిణీ చేస్తూ తాను ప్రజలకు బాగా దగ్గర అయిపోయారు. తమ ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి వస్తూండడంతో పేదల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. వారి సమస్యలను అక్కడికక్కడే తీరుస్తూ బాబు వారికి అదృష్ట దేవుడుగా మారుతున్నారు.

కేవలం ఆ కుటుంబం వారికే కాదు సమీపంలో ఉన్న ఇతర ఇళ్ల వారు కూడా అక్కడకి వస్తే అందరి మధ్యన రచ్చ బండ తరహా సమావేశాలు జరుపుతున్నారు. ప్రభుత్వం పనితీరు తెలుసుకుంటున్నారు. అంతే కాదు వారికి పధకాలు అందుతున్నాయా లేదా వాకబు చేస్తున్నారు.

ఈ విధంగా ప్రతీ నెలా బాబు పెన్షన్ పంపిణీ కోసం వెళ్తూ సరికొత్త వ్యూహాలనే అమలు చేస్తున్నారు. ఇప్పటిదాకా రాయలసీమ కోస్తా గోదావరి జిల్లాలలో పర్యటించిన చంద్రబాబు మొదటిసారి అల్లూరి సీతారామరాజు జిల్లాకు వస్తున్నారు.

చంద్రబాబు జూలై 1వ తేదీన అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరులో పెన్షన్ పంపిణీ చేస్తారు అని అంటున్నారు. ఆ విధంగా ఆయన తొలిసారి గిరిజన ప్రాంతాలలో పెన్షన్ లబ్దిదారులకు అందిస్తూ వారి సాధక బాధకాలను తెలుసుకుంటారు అని అంటున్నారు.

మన్యంలో అనేక సమస్యలు ఉన్నాయి. మారుమూల తండాలు ఉన్నాయి. ఈ రోజుకీ వారు రోగులను ఆసుపత్రులకు తరలించాలీ అంటే డోలీలనే ఆశ్రయిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా చోట్ల రోడ్లను వేస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ చాలా సార్లు మన్యం ప్రాంతాలలో పర్యటించి రోడ్లకు శంకుస్థాపన చేశారు. గిరిజన ప్రాంతాలలో రహదారులను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సైతం నిధులు మంజూరు చేశారు.

దాంతో గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఏ తీరున సాగుతున్నాయి అన్నది బాబు స్వయంగా వాకబు చేయనున్నారు. అంతే కాకుండా గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం ఆయన తెలుసుకుని వారికి అక్కడికక్కడే పరిష్కారాలని కూడా అందిస్తారు అని అంటున్నారు.

ఇక చూస్తే రాజకీయంగా అల్లూరు జిల్లాలోని పాడేరు అరకు అసెంబ్లీ స్థానాతో పాటు అరకు ఎంపీ సీటు కూడా వైసీపీ పరం అయింది. ఈ ప్రాంతాలలో టీడీపీ గెలిచి 15 ఏళ్ళు అయింది. దాంతో రాజకీయంగా బలపడేందుకు కూటమి పార్టీలు చూస్తున్నాయి.

అందుకే పవన్ కళ్యాణ్ అనేక సార్లు ఏజెన్సీ పర్యటన చేస్తూ వస్తున్నారు అని అంటున్నారు. ఇపుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కూడా పాడేరుకు తొలిసారి వస్తుండడంతో రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా ఉంది. చంద్రబాబు తన తాజా పర్యటనతో అల్లూరి జిల్లాకు ఏఏ వరాలు ఇస్తారో ఏ రకమైన ప్రకటనలు చేస్తారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

Tags:    
  • ChandrababuNaidu 
  • PaderuVisit 
  • TribalDevelopment 
  • PensionDrive 
  • APCM 
  • AndhraPolitics 
  • AlluriDistrict 
  • TDP 
  • Janmabhoomi 
  • CMOnDuty 
  • GrassrootsGovernance 
  • Filmindustry 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS