విజన్ మాత్రమే కాదు.. అమలూ ముఖ్యమే: చంద్రబాబు
విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా పేరొందిన ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.;
విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా పేరొందిన ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విజన్ ఉంటేనే సరిపోదని.. దానిని అమలు చేయడమే అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీని ఆద్యంతం ఆసక్తిగా ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
తొలుత రాజ్యాంగం ప్రాధాన్యాన్ని వివరించిన చంద్రబాబు.. రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏదైనా సాధించేందుకు కృషితో పాటు సరైన నిర్ణయాలు కూడా ముఖ్యమేనని తెలిపారు. ఏదైనా సాధించగలం అన్న నమ్మకం అత్యంత ముఖ్యమని చెప్పారు. సంక్షోభాలను సైతం అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగాలని సూచించారు. ఇది.. నిరంతర శ్రమతోనే సాధ్యమవుతుందన్నారు. రాత్రికి రాత్రి విజయం రమ్మంటే రాదన్న ఆయన.. తాను కూడా ఎంతో కష్టపడుతున్నానని చెప్పారు.
సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నవారే.. ఎదుగుతారని చంద్రబాబు చెప్పారు. విద్యార్థిదశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని సూచించారు.తాను కూడా విద్యార్థి దశ నుంచే ఎదిగానని తెలిపారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యానని వివరించారు. నాలుగో సారి ముఖ్యమంత్రిగా పనిచే స్తున్నానని చంద్రబాబు చెప్పారు. తాజాగా విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆద్యంతం బాగుంద న్నారు. విద్యార్థులు.. బాధ్యతగా మాక్ అసెంబ్లీని నిర్వహించారని తెలిపారు.