పిక్ ఆఫ్ ది డే... నాడు లోకేష్ మిస్సైంది నేడు దొరికింది!
నేడు ఏపీ వ్యాప్తంగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జరిగిన సంగతి తెలిసిందే.;
నేడు ఏపీ వ్యాప్తంగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్.. తన లైఫ్ లోని 'పీటీఎం'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును.. స్కూల్స్ లో జరిగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి కొంతమంది నాన్న రావాలని, కొంతమంది అమ్మ రావాలని కోరుకుంటుంటారు! మరికొంతమంది ఇద్దరూ వస్తే బాగుండు అని భావిస్తారు! ఇంకొంతమంది ఎవరూ రాని పరిస్థితిని కలిగి ఉంటారని అంటారు! ఈ సమయంలో తాను స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో తన జీవితంలో జరిగిన పీటీఎం గురింలను లోకేష్ గుర్తుచేసుకున్నారు.
ఇందులో భాగంగా... తాను చదువుకునే రోజుల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగేదని గుర్తుచేసుకున్న లోకేష్... అయితే ఆ మీటింగ్స్ కు తన తండ్రి చంద్రబాబు ఎప్పుడూ రాలేదని, తల్లి భువనేశ్వరి మాత్రమే హాజరయ్యేవారని తెలిపారు. కానీ మీ పేరెంట్ టీచర్స్ మీట్ కు మాత్రం ఏకంగా సీఎం చంద్రబాబు హాజరయ్యారని లోకేష్ విద్యార్ధులకు తెలిపారు.
ఇదే సమయంలో... ఇప్పుడు తన కుమారుడు దేవాన్ష్ పేరెంట్ టీచర్స్ మీట్ కు తాను కూడా వెళ్లలేకపోతున్నానని, తన భార్య బ్రాహ్మణి మాత్రమే వెళ్తుందని తెలిపారు. ఈ విధంగా... తన స్కూల్ డేస్ నుంచే తన తండ్రి ప్రజాసేవకు అంకితమైపోయిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. నేడు తాను అదే పంథాలో ఉన్న విషయాన్ని తలచుకుంటూ లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు!
ఈ సందర్భంగా నాడు తాను తండ్రితో పాటు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వద్ద తీసుకోవాల్సిన ఫోటోను.. నేడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తన తండ్రితో, మంత్రి హోదాలో ఉన్న తాను ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై... "నాడు లోకేష్ మిస్సైంది నేడు దొరికింది" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.