కుప్పం మా కర్మభూమి... ఎవరూ మార్చలేరు: చంద్రబాబు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం తనకు, తన కుటుంబానికీ కర్మ భూమి వంటిదని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిని ఎవరూ మార్చలేరని అన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం తనకు, తన కుటుంబానికీ కర్మ భూమి వంటిదని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిని ఎవరూ మార్చలేరని అన్నారు. గతంలో కుప్పం నియోజకవర్గం కైవసం చేసుకునేందుకుకొందరు ప్రయత్నించారని, కానీ, వారి వల్ల కాలేదని వైసీపీ పై విమర్శలు గుప్పించారు. ఇక్కడి ప్రజలు ద్రుఢంగా నిలిచారని.. వారి ఆశీర్వాదంతోనే గత 40 ఏళ్లుగా తాను ఇక్కడ విజయం దక్కించుకుంటున్నట్టు చెప్పారు. ఈ చరిత్రను ఎవరూ తిరగరాయలేరని చెప్పారు. కుప్పం నుంచే ఇకపై పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు.
కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. దాదాపు 120 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడి యువతకు ఇక్కడే ఉపాధి కల్పించే పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. కుప్పం యువత ఎంతవరకు చదువుకున్నా.. ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామన్నారు. ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వలస పోకుండా కూడా ఏర్పాట్లు చేస్తామని.. ఉన్న చోటే ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాయలసీమలో లక్ష కోట్ల రూపాయలతో హార్టీకల్చర్(పండ్లసాగు)ను డెవలప్ చేయనున్నట్టు సీఎం చెప్పారు.
''గతంలో ఏం జరిగిందో మీరు చూశారు. కుప్పంలో పాగా వేయాలని కుతంత్రాలు పన్నారు.కానీ, మీరంతా ఏకమై.. ఆ కుట్రలను తిప్పికొట్టారు. ఇదే స్ఫూర్తి రాష్ట్ర వ్యాప్తంగా కనిపించాలి. కొందరు మారీచులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజధానిపై వారికి ఇంకా అక్కసు కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వారికి శాశ్వతంగా సమాధానం చెప్పాలి. అందుకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాలి.'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సుస్తిర ప్రభుత్వం కొనసాగితేనే అభివృద్ధి, పెట్టుబడు లు సాధ్యమవుతాయని.. గుజరాత్ వంటి రాష్ట్రాల మాదిరిగా ఏపీ ఎదిగేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని చెప్పారు.
ఏ రంగాన్ని తీసుకున్నా.. కుప్పం తర్వాతే అన్నట్టుగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాల నుంచి వ్యవసా య ఉత్పత్తుల వరకు అన్ని రంగాలను డెవలప్ చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామన్నారు. విద్యుత్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలను కుప్పం ప్రజలు ఎంతో ముందుగానే అందుకున్నారని, ఇళ్లపైనే సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన ఏకైన నియోజకవర్గంకుప్పమేనని చెప్పారు. ఇలాంటి స్ఫూర్తితో ప్రబుత్వం చేపట్టే కార్యక్రమాలకు కూడా మద్దతుగా నిలవాలని ఆయన సూచించారు.