'అయోధ్య' పాకులాట‌: ప‌రువు పోయాక‌.. ప్ర‌తిష్ఠ కోసం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత అయోధ్య రామ‌మందిరానికి భ‌క్తులు స‌మ‌ర్పించిన కోట్ల రూపాయ‌ల విరాళాలు, న‌గ‌దు, న‌గలు వంటివి వీటిని లెక్కించేందుకు వ‌చ్చిన సిబ్బంది దోచుకున్న‌విష‌యం తెలిసిందే.

Update: 2026-07-05 08:00 GMT

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత అయోధ్య రామ‌మందిరానికి భ‌క్తులు స‌మ‌ర్పించిన కోట్ల రూపాయ‌ల విరాళాలు, న‌గ‌దు, న‌గలు వంటివి వీటిని లెక్కించేందుకు వ‌చ్చిన సిబ్బంది దోచుకున్న‌విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం వాల్ స్ట్రీట్ వంటి అమెరికా జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌ముఖంగా వ‌చ్చింది.ఇక‌, నిన్న మొన్న‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న ఆర్ ఎస్ ఎస్ సైతం దీనిపై ఘాటుగా స్పందిం చింది. ఇక‌, యూపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం స‌మాజ్‌వాదీ స‌హా.. జాతీయ ప్ర‌ధాన ప్రతిప‌క్షం కాంగ్రెస్‌లు ఈ వ్య‌వ‌హారాన్ని ఊరూ వాడా ప్ర‌చారం చేశాయి. మొత్తంగా రామ‌య్య మాట ఎలా ఉన్నా.. యూపీ స‌ర్కారు ప‌రువు, ఆల‌య ట్ర‌స్టు ప‌రువు మ‌ర్యాద‌లు రోడ్డు ప‌డ్డాయి.

కాగా.. ఇప్ప‌టికీ.. ప్ర‌ధాన నిందితుల నుంచి సొమ్మును రిక‌వ‌రీ చేయ‌క‌పోవ‌డం, ఉద్దేశ పూర్వ‌కంగానే మాస్ట‌ర్ మైండ్స్‌ను దాస్తు న్న ఆరోప‌ణ‌లు కూడా రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు దర్యాప్తునుముమ్మ‌రం చేశామ‌ని సీఎం యోగి ఆదిత్య‌నాథ్ చెబుతున్నా.. ఈ వ్య‌వ‌హారంపై వ‌స్తున్న విమ‌ర్శ‌లు మాత్రం ఆగ‌డం లేదు. ఇదిలావుంటే.. ఈ కేసును రేపో మాపో సుప్రీంకోర్టు విచార‌ణ‌కు తీసుకోనుంది. దీంతో అలెర్ట్ అయిన రామ‌జ‌న్మ‌భూమి ట్ర‌స్టు.. చేతులుకాలిన త‌ర్వాత‌..ఆకులు ప‌ట్టుకున్న చందంగా.. చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇక నుంచి విరాళాల లెక్కింపును క‌ఠిన‌త‌రం చేస్తున్నామ‌ని.. అడుగ‌డుగునా పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఏం చేస్తారు?

+ విరాళాలు లెక్కించేందుకు వినియోగించే ఉద్యోగుల మొబైల్ ఫోన్లు, కెమెరాలను లోప‌లికి అనుమ‌తించ‌రు.

+ విరాళాల లెక్కింపున‌కు వ‌చ్చే వారికి జేబులు లేని దుస్తులు ఇవ్వ‌నున్నారు. లేదా సొంతంగా తెచ్చుకునేందుకు అనుమ‌తి ఇస్తారు. ఎక్కువ భాగం.. పంచెల‌తోనే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ప్ర‌య‌త్నిస్తారు. కాదంటే.. నీలం రంగు యూనిఫాంను అందిస్తారు.

+ హుండీ లెక్కింపు హాలులోకి సిబ్బంది ప్రవేశించడానికి ముందు వారిని క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తారు. సొంత‌గా సొమ్ములు తెచ్చుకునేందుకు కూడా అనుమ‌తించ‌రు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. ఉత్త‌చేతుల‌తో వ‌చ్చి.. ఉత్త చేతుల‌తోనేబ‌య‌ట‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఆమేర‌కు రెండు సార్లు త‌నిఖీలు చేస్తారు.

+ విరాళాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు బ‌ల్ల‌ల‌పై పోసి లెక్కించే విధానం ఉంది. దీనిని ఆపేయ‌నున్నారు.

+ విరాళాల సొమ్మును.. ఒక్కొక్క బ‌ల్ల‌పై కాకుండా.. పూర్తిగా నేల‌పైనే పోసి లెక్కించ‌నున్నారు. త‌ద్వారా.. దుస్తుల్లో సొమ్మును దాచి అప‌హ‌రించే విధానానికి స్వ‌స్తి చెప్ప‌నున్నారు.

+ సీసీ కెమెరాల‌ను త‌క్ష‌ణ మార్పుల‌కు అనుగుణంగా ఏర్పాటు చేయ‌నున్నారు. అంటే.. మొబైల్ సీసీకెమెరాల‌ను ఏర్పాటు చేస్తారు. వీటిని సిబ్బంది విరాళాలు లెక్కించే స‌మ‌యంలో ప‌ర్య‌వేక్షించేందుకు సిబ్బందిని నియ‌మించనున్నారు.

కొస‌మెరుపు ఏంటంటే.. తిరుమ‌ల శ్రీవారి హుండీ ఆదాయాన్ని లెక్కించే విధానంపై అధ్య‌య‌నం చేసేందుకు అయోధ్య రామ‌జ‌న్మ‌భూమి ట్ర‌స్టు కొంద‌రిని పంపించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. తిరుమ‌ల‌లో జ‌రుగుతున్న విధానాన్ని అధ్య‌య‌నం చేసి.. ప‌క్కా ఏర్పాట్లు, భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న పెంచుకోనున్నారు. దీనినే అయోధ్యంలోనూ వినియోగించాల‌ని భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు.

Tags:    

Similar News