పార్ల‌మెంటు ఫైట్‌: తాంబూలాలిచ్చేసిన రాష్ట్ర‌ప‌తి!

తాజాగా జాతీయ మీడియాలో మాత్రం దీనికి భిన్నంగా .. తొలిసారి `పార్ల‌మెంటు ఫైట్‌` అని పేర్కొన‌డం, రాష్ట్ర‌ప‌తి తాంబూలాలిచ్చేశార‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

Update: 2026-07-05 07:59 GMT

''సాధార‌ణంగా పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర‌ప‌తి ఈ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు ఆమోద ముద్ర‌వేశా రు''- అని వార్త‌లు రావ‌డం స‌హ‌జం. కానీ, తాజాగా జాతీయ మీడియాలో మాత్రం దీనికి భిన్నంగా .. తొలిసారి `పార్ల‌మెంటు ఫైట్‌` అని పేర్కొన‌డం, రాష్ట్ర‌ప‌తి తాంబూలాలిచ్చేశార‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఇలా ఎందుకు వ్యాఖ్యానించారు? కార‌ణం ఏంటి? అనేది ఆస‌క్తిక‌ర అంశం. ఇదిలావుంటే.. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోదం తెలిపా రు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆగ‌స్టు 13వ తేదీ వ‌ర‌కు ఈ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఇక‌, జాతీయ మీడియా స‌హా స్థానిక మీడియాల్లో పార్ల‌మెంటు స‌మావేశాల‌ను `ఫైట్‌` అని పేర్కొన‌డం ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తు తం జాతీయ రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే... అధికార ప‌క్షానికి, విప‌క్షాల‌కు మ‌ధ్య ప‌లు అంశాల్లో తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఇదేస‌మ‌యంలో ప్రాంతీయ పార్టీల‌ను చీల్చుతున్న వ్య‌వ‌హారం కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా ఉత్కంఠ భ‌రితంగా కూడా మారుతోంది. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంటు స‌మావేశాల్లో స‌జావుగా ఉండే చ‌ర్చ‌ల‌కు అవ‌కాశం లేద‌ని జాతీయ మీడియా పేర్కొంది. ఆవేశ కావేశాలు.. నిర‌స‌న‌లు, బాయ్‌కాట్‌లు, అరుపులు పెడ‌బొబ్బ‌లు గ‌తానికి భిన్నంగా ఈ ద‌ఫా ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంటున్నారు.

రీజ‌నేంటి?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రుగుతున్న తొలి పార్ల‌మెంటు స‌మావేశాలుకావ‌డంతో స‌హ‌జంగానే ఎన్నిక‌ల్లో విజ యం ద‌క్కించుకున్న పార్టీగా బీజేపీకి, ఓడిన పార్టీగా కాంగ్రెస్‌కు మ‌ధ్య మాటల యుద్ధం కామ‌నే. దీంతోపాటు.. ప‌శ్చిమ బెంగా ల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీని నిలువునా చీల్చుతున్న వ్య‌వ‌హారం, ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో వేరు కుంప‌ట్లు పెట్టించ‌డం వెను క బీజేపీ ఉంద‌న్న ఆరోప‌ణ‌లు వంటివి పార్ల‌మెంటు వేదిక‌గా తృణ‌మూల్ నిల‌దీయ‌డం ఖాయం. ఇక‌, మ‌హారాష్ట్రలో మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే నేతృత్వంలోని ఉద్ధ‌వ్ శివ‌సేన వ‌ర్గాన్నికూడా చీల్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్న ఆరోప‌ణ‌లు వున్నాయి. ముగ్గురు ఎంపీలు బీజేపీకి ట‌చ్‌లో ఉన్నారు. ఈ ప‌రిణామాలు కూడా పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల‌ను కుదిపేయ‌నున్నాయి.

మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న అయోధ్య రామమందిరంలో భ‌క్తులు స‌మ‌ర్పించిన విరాళాల సొమ్ము మాయం కావ‌డం.. నిందితుల జాబితా పెరుగుతుండ‌డం వంటివి కూడా బీజేపీకి సెగ‌పెంచుతున్నాయి. ఈ వ్య‌వ‌హారం వెలుగు చూసి దాదాపు నెల రోజులు అయిపోయినా.. ప్ర‌ధాని మోడీ నుంచి కేంద్ర మంత్రుల వ‌ర‌కు ఎవ‌రూ మాట్లాడ‌క పోవ‌డా న్ని కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు త‌ప్పుబ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఈ విష‌యం ప్ర‌ధానంగా ప్ర‌స్తావ‌న కు రావ‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇక‌, మ‌హిళా బిల్లు, పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న విష‌యాలు కూడా స‌భ‌ను కుదిపివేయ‌నున్నాయ‌ని అంటున్నారు. అందుకే జాతీయ మీడియా `పార్ల‌మెంటు ఫైట్` అని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News