మావిగన్ జగన్ కి సొంత గడ్డ మీద రీ సౌండ్ !

ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగా పొలిటికల్ వార్ తీవ్రతరం అయింది. రెండేళ్ళ కూటమి పాలన పూర్తి అయ్యాక రాజకీయ వేడి ఏపీలో బాగా పెరిగింది.

Update: 2026-07-04 02:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగా పొలిటికల్ వార్ తీవ్రతరం అయింది. రెండేళ్ళ కూటమి పాలన పూర్తి అయ్యాక రాజకీయ వేడి ఏపీలో బాగా పెరిగింది. ఇపుడు ఇష్యూ మొత్తం రాజధాని చుట్టూ తిరుగుతోంది. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అంటూ చట్టబద్ధత కల్పించింది. ఉభయ సభలూ దానికి ఓకే చెప్పాయి. ఆ మీదట రాష్ట్రపతి రాజ ముద్రతో అమరావతికి అధికారిక రాజధాని హోదా వచ్చేసింది. ఆ మీదట ఆ టాపిక్ క్లోజ్ అని అంతా అనుకున్నారు. కానీ వైసీపీ ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మావిగన్ అంటూ గత మూడు నెలలుగా ఇదే అంశం మీద తన వాదన కొనసాగిస్తోంది. మంచికో చెడ్డకో దానిని జనంలో పెట్టి చర్చకు తెర లేపాలని చూస్తోంది.

కూటమి ఫుల్ అలెర్ట్ :

దీని మీద కూటమి ప్రభుత్వం కూడా అలెర్ట్ గా ఉంది. అందుకే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలలో అమరావతి గురించి గట్టిగానే చెబుతూ వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అమరావతి రాజధాని ఆవసరం గురించి చెబుతూ వస్తున్నారు. తాజాగా కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం కార్యక్రమంలో చంద్రబాబు జై అమరావతి నినాదంతో జనాలను ఆకట్టుకున్నారు. దానికి జగన్ సొంత జిల్లా కడప కూడా జై అంటూ ప్రతిధ్వనించిన నేపధ్యం ఇపుడు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది.

రోజుకో మాట అంటూ :

ఇదిలా ఉంటే జగన్ మీద ఆయన సొంత గడ్డ కడపలోనే చంద్రబాబు ఘాటుగా విమర్శలు చేశారు. జగన్ స్థిరమైన వ్యక్తిత్వం లేకుండా రోజుకో ప్రాంతాన్ని రాజధాని అంటున్నారని బాబు ఫైర్ అయ్యారు. గత పాలకులు విధ్వంసమే అజెండాగా చేసుకుని పనిచేశారని వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. విశ్వసనీయత లేని పార్టీకి విలువలు కూడా లేవని చంద్రబాబువ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిగా అంగీకరించి అధికారంలోకి కాగానే మూడు ముక్కలాట ఆడారని బాబు గుర్తు చేసారు.

కేంద్రం చట్టం చేసినా :

అమరావతిని కేంద్రం చట్టబధ్ధంగా రాజధానిగా ప్రకటించింది అని చంద్రబాబు చెప్పారు. అంతలా కేంద్ర చట్టబద్ధతతో అమరావతి రాజధానిగా కొనసాగుతున్నా కూడ జగన్ మావిగన్ అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారని బాబు ఆక్షేపించారు. ఆయన మావిగన్ అంటూనే నిన్నటికి నిన్న విజయవాడ అన్నారని రేపు ఏమంటారో తెలీదని బాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం నమ్మకంతో విశ్వాసంతో పాలన అందిస్తోందని బాబు చెప్పారు. అందుకే ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆడుకోవద్దు అంటూ :

ఏపీ ప్రజల జల ఆత్మాభిమానంతో ఆటలు ఆడుకోవద్దని జగన్ కి చంద్రబాబు హితవు పలికారు. గత పాలనలో ఏపీకి రాజధాని ఏమిటో ఎక్కడుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని మాత్రమే కాదు ప్రజలను సైతం జగన్ తీవ్రంగా నష్ట పరిచారని చంద్రబాబు ఆక్షేపించారు. ఇదిలా ఉంటే తాను రాష్ట్ర ప్రజలంతా గర్వంగా కాలరెగరేసి చెప్పుకునేలా అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తానని బాబు గట్టి భరోసా ఇచ్చారు. జై అమరావతి అని కడప సభ దద్దరిల్లడం విశేషం. మొత్తం మీద మావిగన్ అని నినదించిన జగన్ కి కడపలోనే రీ సౌండ్ వచ్చేలా బాబు చేసినట్లు అయింది అని అంటున్నారు.

Tags:    

Similar News