జనసేన 2029 ఎన్నికల లెక్క మారుస్తుందా ?
జనసేన పార్టీలో ఏపీలో కీలకమైనది అన్నది తెలిసిందే. 2019లో సొంతంగా పోటీ చేస్తే ఆరు శాతం ఓటు షేర్ దక్కించుకుంది. 2024లో పొత్తులతో వెళ్ళినా జనసేనకు ఓటు షేర్ డబుల్ అయింది అని జనసైన నేతలు చెబుతున్నారు.
జనసేన పార్టీలో ఏపీలో కీలకమైనది అన్నది తెలిసిందే. 2019లో సొంతంగా పోటీ చేస్తే ఆరు శాతం ఓటు షేర్ దక్కించుకుంది. 2024లో పొత్తులతో వెళ్ళినా జనసేనకు ఓటు షేర్ డబుల్ అయింది అని జనసైన నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో మూడు పార్టీలు ఉన్నట్లే అని అంటున్నారు. టీడీపీ వైసీపీ బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉంటే మూడవ ఆల్టర్నేషన్ గా జనసేన కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. అయితే జనసేన పొత్తులో ఉండడం వల్ల ఏపీలో రెండు శిబిరాల రాజకీయమే కొనసాగుతోంది అని అంటున్నారు.
విపక్ష మైదానంలో స్పేస్ :
ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షం వైపు ఉన్న మైదానంలో ఎక్కువ స్పేస్ ఉందని అంటున్నారు. వైసీపీ ఒక్కటే ఆ ప్లేస్ ని ఆక్రమించింది. అయితే వైసీపీ అనుకున్న స్థాయిలో విపక్ష పాత్ర పోషించి రాణించలేకపోతోంది అని గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయినా వైసీపీ ప్రజా సమస్యల మీద పోరు చేసినది తక్కువే అని అంటున్నారు. మరీ ముఖ్యంగా అసెంబ్లీని వైసీపీ పెద్దగా వాడుకోవడం లేదని అసెంబ్లీని వెళ్ళడాన్నే డుమ్మా కొట్టేసి వైసీపీ అధికారికంగా జనం వద్ద ప్రతిపక్ష హోదాని కోల్పోతోందని అని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ తరువాత ఏదైనా విపక్షంలో ఉంటే కనుక జనాలు ఆ వైపునకు మొగ్గు చూపుతారు అన్న విశ్లేషణలు ఉన్నాయి.
జనసేనకు గోల్డెన్ చాన్స్ :
ఇక జనసేన విషయం తీసుకుంటే అధికార కూటమిలో ఉంది. ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు ముగ్గురు ఎంపీలతో మంచి పొజిషన్ లో ఉంది. అయితే అధికార కూటమిలో పెద్దన్న పాత్ర టీడీపీదే అన్నది తెలిసిందే. జనసేన నుంచి కూడా రాజకీయ నాయకత్వం అందుకోవాలన్న డిమాండ్ అయితే ఒక బలమైన సామాజిక వర్గంలో ఉంది. దానికి కూటమిలో ఉంటే సాధ్యపడదని అంటున్నారు. జనసేన ఒంటరిగా బరిలోకి దిగితేనే జనాల నుంచి మద్దతు వస్తుందని అంటున్నారు. నిజానికి అధికార టీడీపీ బలంగా ఉంది. పొత్తులతో జనసేన మరింతగా బలపరాల్చిన అవసరం ఉందా అన్నది ఒక ప్రశ్న. అదే సమయంలో విపక్షం వైపు వీక్ గా ఉంది. విపక్షం అంటే జనం గొంతుక. జనసేన కనుక తన ప్లేస్ మార్చుకుని పొజిషన్ నుంచి అపొజిషన్ కి వస్తే కనుక ఏపీ రాజకీయాలలో సంచలనమైన మార్పులే వస్తాయని అంటున్నారు.
ఆ రిజల్ట్స్ ని మరచి :
ఇక జనసేన అయితే 2019 నాటి ఫలితాలనే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నిజానికి అది జనసేనకు రాంగ్ టైం అని అంటున్నారు. వైసీపీకి ఒక్క చాన్స్ ఇద్దామని జనాలు డిసైడ్ అయిన నేపధ్యంలో జనసేన విపక్షం వైపు నుంచి పోటీగా వచ్చింది. అందుకే చేదు ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ఇపుడు చూస్తే అలా కాదని ఏపీ జనాలు జగన్ పాలన చూసేశారు అని గుర్తు చేస్తున్నారు. అలాగే ఏపీలో నాలుగు సార్లు చంద్రబాబు సీఎం గా పాలన కూడా చూశారని చెబుతున్నారు. అందువల్ల మూడవ ఆల్టర్నేషన్ గా జనసేన కనుక 2029 ఎన్నికల్లో బరిలోకి దిగితే మాత్రం అనూహ్యమైన ఫలితాలు ఏపీ రాజకీయ చరిత్రలో నమోదు అవుతాయని అంటున్నారు.
ధైర్యం చేస్తేనే మరి :
తమిళనాడు ఎన్నికల ఫలితాలను ఈ సందర్భంగా పలువురు ఉదహరిస్తున్నారు. అక్కడ విజయ్ కూడా రెండు ద్రవిడ పార్టీల మీద గట్టిగా నిలబడి పోటీ చేశారని జనాలు అయితే విపక్షంలోని అన్నా డీఎంకే పెర్ఫార్మెన్స్ మీద పూర్తి వ్యతిరేకతో ఉన్నారని అలాగే అధికారంలో ఉన్న డీఎంకే మీద యాంటీ ఇంకెంబెన్సీ ఉందని దాంతో విజయ్ ని జనాలు నెత్తికెత్తుకున్నారని అంటున్నారు. ఏపీలో కూడా 2029 నాటికి జనసేన సోలోగా బరిలోకి దిగితే అలాంటి ఫలితాలే వస్తాయని అంటున్నారు. పైగా విజయ్ కి లేని రాజకీయ సామాజిక అడ్వాంటేజెస్ పవన్ కి ఉన్నాయని అంటున్నారు. పవన్ లో నిజాయతీ ఉందని అవినీతి మరక అన్నది ఆయనకు లేదని దాంతో న్యూట్రల్ జనాలతో పాటు జెన్ జీ తరం మహిళలు యువత విద్యావంతులు అంతా ఆయనకు సీఎం గా ఒక చాన్స్ కచ్చితంగా ఇస్తారని అంటున్నారు. అయితే జనసేన ఈ విషయంలో డేర్ చేసి రంగంలోకి దిగడమే చేయాల్సిన పని అని అంటున్నారు. మరి జనసేనను అభిమానించే వారు ఒక బలమైన సామాజిక వర్గం వారు అంతా సోషల్ మీడియా వేదికగా జనసేనకు విలువైన సూచనలు ఇస్తున్నారు. మరి జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంది.