రాజకీయ చెత్త... బాబు షాకింగ్ కామెంట్స్ వైరల్
చంద్రబాబు దూకుడు పెంచుతున్నారు. అది నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా కనిపిస్తూనే ఉంది.;
చంద్రబాబు దూకుడు పెంచుతున్నారు. అది నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా కనిపిస్తూనే ఉంది. ఆయన గత సారి మాదిరిగా ఎక్కడా ఏ చిన్న మాత్రం చాన్స్ అయినా ఇవ్వదలుచుకోలేదు. సాధారణంగా అయితే రాజకీయ విమర్శలు ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఎక్కువగా ఉంటాయి. ఘాటైన వ్యాఖ్యలతో నిప్పులు చెరగడం కనిపిస్తుంది. కానీ ఈ పర్యాయం మాత్రం బాబు అన్ స్టాపబుల్ అన్నట్లుగా ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతున్నారు. అది చిన్న వేదిక అయినా పెద్ద వేదిక అయినా ఎక్కడ అయినా ఆయన వైసీపీని అసలు వదలడం లేదు, చండ్ర నిప్పులే చెరుగుతున్నారు.
కొందరు డిక్టేటర్లు ఉన్నారు :
చంద్రబాబు శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మాచర్ల పర్యటన చేశారు. ఈ సందర్భంగా ప్రజా వేదిక నుంచి ప్రసంగించిన ఆయన వైసీపీని దంచి వదిలిపెట్టారు. వైసీపీ పేరు ఎత్తకుండానే అన్ని రకాలుగా విమర్శలు చేశారు కొందరు డిక్టేటర్లు ఉన్నారు అని ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. వారు ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలు ఏ మాత్రం క్షమించరు అని స్పష్టంగా చెప్పేశారు.
వారితో జాగ్రత్త :
అరాచక శక్తులు మాచర్లలో గతంలో చాలా విధ్వంసాలు చేశారు అని బాబు విమర్శించారు. ఎక్కడో రాజీవ్ గాంధీ హత్య జరిగితే మాచర్లలో రౌడీలు విధ్వంసం సృష్టించారు అని మూడున్నర దశాబ్దాల నాటి వైనాన్ని జనాలకు గుర్తు చేశారు. గత అయిదేళ్ళూ జనాలకు ఎలాంటి స్వచ్చ లేకుండా చేశారని అయితే ఈ రోజున తమ ప్రభుత్వ హయంలో మాచర్లకు స్వాతంత్ర్యం వచ్చిందని బాబు అన్నారు. అందుకే ప్రజలు అందరిలోనూ సంతోషం కనిపిస్తోందని, ఇక ఇదే శాశ్వతం కావాలని శాశ్వతం చేస్తామని బాబు చెప్పారు. మాచర్లలో మొన్నటి వరకూ ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు లేవని ఇపుడు మాత్రం ప్రజలకు న్యాయం జరిగింది అని అన్నారు.
మెడకు ఉరితాళ్ళు :
వైసీపీ పాలనలో తనౌ మాచర్ల వద్దామంటే తన ఇంటికి తాళ్లు కట్టి రానీయకుండా చేశారని బాబు మండిపడ్డారు. అయితే నా ఇంటికి తాళ్లు కట్టి వారి మెడలకు వారే ఈ రోజున ఉరితాళ్లు వేసుకున్నారని సెటైర్లు పేల్చారు. ఇక మీద ఎవరు ఎలాంటి రౌడీయిజం చేసినా విధ్వంసం చేసినా చూస్తూ ఊరుకోనని బాబు హెచ్చరించారు. ఎవరూ కూడా నేరాలు వద్దు ఘోరాలు చేయొద్దు అని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలా చేయాలనుకుంటే యాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు.
చెత్త అక్కడే ఎక్కువ :
ఇక రాజకీయ చెత్త అంటూ చంద్రబాబు వైసీపీ మీద పరోక్షంగా హాట్ కామెంట్స్ చేశారు. మన పరిసరాల్లోని చెత్తే కాదు రాజకీయ చెత్తను కూడా తొలగించాల్సిన అవసరం అయితే అందరి మీదనూ ఉందని ఆయన అన్నారు
గత పాలకులు రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను అలాగే ఉంచేశారు అని బాబు విమర్శించారు. అంతే కాదు ఆఖరుకు చెత్తపై సైతం పన్నులు వేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ చెత్తను తొలగించటంతో పాటు చెత్త రాజకీయాలను కూడా తొలగిస్తానని బాబు శపధం చేశారు ఈ విషయంలో ప్రజలు కూడా సహకరించాలని అన్నారు. మొత్తానికి రాజకీయ చెత్త అంటూ బాబు చేసిన ఈ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.