పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పిన బాబు.. నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్!
అవును... పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక అప్ డేట్ ఇచ్చారు. తాజాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన.. దీనిపై కీలక విషయాలు వెల్లడించారు.;

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే చంద్రబాబు తమ ప్రధాన ప్రాధాన్యతల గురించి స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అని క్లారిటీ ఇచ్చారు. ఈ సమయంలో ఇప్పటికే అమరావతి అడుగులు అత్యంత వేగంగా పడుతుండగా.. పోలవరం పనులు పరుగెడుతున్నాయని చెబుతూ, అందుబాటు తేదీని వెల్లడించారు!
అవును... పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక అప్ డేట్ ఇచ్చారు. తాజాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన.. దీనిపై కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, కేంద్రం కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలిపారు.
ఇందులో భాగంగా... పోలవరానికి కేంద్రం రూ.12,500 కోట్లు ఇచ్చిందని చెప్పిన చంద్రబాబు... రాబోయే ఏడాదిన్నరలో ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు.
ఇదే సమయంలో... విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం రూ.11,400 కోట్లు మంజూరు చేసిందని చెప్పిన చంద్రబాబు... మరో నాలుగైదు నెలల్లో అది లాభాల బాట పడుతుందని తెలిపారు. ఇదే క్రమంలో రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు మంజూరు చేశామని.. రాజధాని ప్రాంతంలో పనులను పట్టాలెక్కించామని తెలిపారు.
అదేవిధంగా... ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపైనా బాబు వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా... ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచి ఇస్తున్నామని.. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని.. ప్రతి రైతుకూ రూ.20వేల సాయం చేస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభిస్తామని ప్రకటించారు!
ఇక.. వాట్సప్ గవర్నెన్స్ తో సుమారు 500 సేవలు ఆన్ లైన్ లో అందిస్తున్నామని చెప్పిన సీఎం... ఆగస్టు 15 నాటికి మొత్తం 703 సేవలు ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనివల్ల అవినీతి తగ్గుతుందని.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే.. 2029 ఎన్నికలే తన టార్గెట్ అని చంద్రబాబు సూటిగా చెప్పారు.