వైసీపీకి మేలు చేస్తున్న చంద్రబాబు.. !
తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నుంచి నాయకులు బయటకు వచ్చే అవకాశం దాదాపు తగ్గిపోయింది.;
రాష్ట్రంలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు పెద్దగా కనిపించడం లేదు. దీనికి కారణాలు చాలానే ఉన్నా యి. నిజానికి ఏటికేడు మారుతున్న రాజకీయాలు, అవసరాల నేపథ్యంలో కొత్త వారికి రెడ్ కార్పెట్ పరి చేందుకు పార్టీలు సిద్ధంగానే ఉన్నాయి. కానీ, ప్రస్తుతం రాజకీయాలు అంటే ఖర్చుతో కూడిన పనికావడం తోపాటు.. ప్రత్యర్థులపై విరుచుకుపడాల్సిన అవసరం పెరిగిపోయింది. దీంతో కొత్తవారు రాజకీయాల వైపు మొగ్గు చూపడం లేదు.
మనోవైపు.. ఉన్న నాయకులు తమకు నచ్చిన పార్టీలోకి చేరేందుకు అవకాశం ఉన్నా.. తాజాగా మారుతు న్న రాజకీయాలు.. పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలతో వారు కూడా ఎక్కడివారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నుంచి నాయకులు బయటకు వచ్చే అవకాశం దాదాపు తగ్గిపోయింది. వైసీపీ నుంచి వచ్చే నాయకులను కోవర్టుగా పేర్కొన్న విషయం తెలిసిందే.
దీంతో వైసీపీలో ఇమడలేని వారు కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా.. రెండు పార్టీలు మాత్రమే వారికి ఆల్టర్నేట్‌గా ఉన్నాయి. 1) బీజేపీ. 2 ) జనసేన. కమ్యూనిస్టు పార్టీలు ఉన్నా.. వాటిలోకి ఎవరూ వెళ్లడం లేదు. సో.. ఇలా చూసుకుంటే.. వైసీపీలో ఇమడలేని వారు.. వస్తే.. బీజేపీలోకి.. లేకపోతే జనసేన లోకి అన్నట్టుగానే రాజకీయాలు మారిపోయాయి. కానీ.. ఈ రెండు పార్టీల్లోనూ చేరడం అంత ఈజీకాదు.
ఎందుకంటే.. బీజేపీలో చేరితే.. హిందూత్వ ముద్రను వేసుకోవాలి. తద్వారా.. క్షేత్రస్థాయిలో మైనారిటీ సహా ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి.. ప్రజల్లో అంతో ఇంతో బలం ఉన్న నాయకులు బీజేపీ వైపు వచ్చే అవకాశం లేదు. ఇక, జనసేనలోకి రావాలని అనుకున్నా.. కేరక్టర్ సహా.. ఇతర అంశాలను కూడా పార్టీ పరిగణనలోకి తీసుకుంటోంది. గతంలో ఎలా ఉన్నా పరిస్థితిని బట్టి పార్టీలోకి తీసుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. సో.. వైసీపీ లో నుంచి బయటకు రావాలనుకున్న వారు.. ఇక, అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.