అసలు ఎవరు ఈ ‘ఢిల్లీ బాబా’.. ఆయన చరిత్ర అంతా మళినమే..
భారత్ ఆధ్యాత్మిక దేశం. ఇక్కడ పుట్టడం, జీవించడం, చావడం ఎన్నో జన్మల పుణ్యఫలమని ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు శ్లాఘిస్తారు.;
భారత్ ఆధ్యాత్మిక దేశం. ఇక్కడ పుట్టడం, జీవించడం, చావడం ఎన్నో జన్మల పుణ్యఫలమని ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు శ్లాఘిస్తారు. అంతెందుకు చాగంటి వారు ఒక ప్రవచనంలో చెప్పిన విషయం పోప్ అంతటి వ్యక్తి భారత నేలపై అడుగు పెడుతున్న సందర్భంలో వేసుకొని నేరుగా కాలు పెట్టకుండా మట్టిని తలపై వేసుకొని కాలు పెట్టారట. వేదాలు పుట్టిన భూమి, కురుక్షేత్రం జరిగిన భూమి అని ఆయన అన్నారట. ఈ దేశానికి అంతటి కీర్తి వచ్చేందుకు కారణం స్వాములు, సన్యాసులు, మునులు మాత్రమే.
కొందరి వల్ల నష్టం..
అయితే మంచి పక్కనే చెడు ఉంటుంది. అంతటి ఆధ్యాత్మికతను కలిగిన ఈ నేలను, ఇక్కడి విలువలను నాశనం చేసేందుకు గోతి కాడి నక్కల్లా ఎదురు చూస్తుంటారు. అయితే వారు కూడా స్వాములు, యోగుల అవతారం ఎత్తి మన సంస్కృతిని నాశనం చేస్తుంటారు. ఇప్పటికే ఎంతో మంది ఈ కోవలోకి వచ్చి నాశనం అయ్యారు. కానీ మన సంస్కృతిని ఏమీ చేయలేకపోయారు. ఇక ఇలాంటి స్వాములను సాకుగా చూపుతూ కొన్ని వర్గాలు మన సంస్కృతిపై దాడి చేయడం కూడా మొదలు పెట్టాయి. కానీ అవి ఏమీ చేయలేకపోయాయి.
నీచపు పనులు..
ఇవన్నీ పక్కన పెడితే.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యమైన పీఠాల్లో ఒకటి శృగేరి పీఠం మొదటిది. ఈ పీఠం ఆధ్వర్యంలో ఎన్నో విద్యాలయాలు నడుస్తున్నాయి. అందులో ఒక ఇనిస్టిట్యూట్ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉంది. శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ కు డైరెక్టర్ గా చైతన్యానంద సరస్వతి (స్వామి పార్థసారధి) హెడ్ గా ఉన్నాడు. అయితే ఆయనపై ఇటీవల విద్యార్థినులు ఆరోపణలు చేశారు.
విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయునులపై కూడా..
పార్థసారధి తమకు అసభ్య పదజాలంతో మెసేజ్ లు పెడుతున్నాడు.. వేధిస్తున్నాడంటూ 17 మంది విద్యార్థునులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. వారి విచారణలో సంచలనమైన నిజాలు బయటపడ్డాయి. విద్యా సంస్థలో చాలా మందిని పార్థసారధి వేధింపులకు గురిచేసినట్లు తేలింది. అందులో 17 మంది లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన చెప్పినట్లు నడుచుకోవాలని ఉపాధ్యాయునులను కూడా వేధించే వాడని వెలుగులోకి వచ్చింది.
గతంలోనూ చండాలమైన చరిత్రే..
గతంలో కూడా పార్థసారధిపై పలు సందర్భాల్లో కేసులు మోదయ్యాయి. 2009లో తనను మోసం చేసినట్లు ఒక యువతి పోలీసులను ఆశ్రయించగా.. 2016లో కూడా వసంత్ కుంజ్ ప్రాంతంలో మరో మహిళ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడని, సీసీ ఫుటేజీలు, ఫోన్ ట్రాకింగ్ ద్వారా ఆయన జాడను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆగ్రా సమీపంలో ఉన్నాడని గుర్తించినట్లు పోలీసులు చెప్తున్నారు.
ఆయనను తొలగించాం..
అయితే శృంగేరీ మఠం పార్థసారధిని తన పదవి నుంచి తొలగించింది. మఠానికి ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. మఠానికి సంబంధించి శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్ మెంట్ కు మరో డైరెక్టర్ ను నియమిస్తామని మఠాధికారులు చెప్తున్నారు.