బైరాన్ - కాబోట్ పబ్లిక్ రొమాన్స్... రిజల్ట్ వచ్చేసింది!

దీనిపై నెట్టింట వీడియోలు, ఫోటోలు, కామెంట్లు, మీమ్స్ అవిరామంగా పుట్టుకొస్తున్నాయి. ఈ సమయంలో బైరాన్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది!;

Update: 2025-07-20 06:49 GMT

అమెరికాలోని ఆస్ట్రానమర్ సంస్థ సీఈఓ ఆండీ బైరన్‌, ఆ కంపెనీ చీఫ్ హెచ్ఆర్ మేనేజర్‌ క్రిస్టిన్ కాబోట్‌.. ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ 'కోల్డ్‌ ప్లే' లో సన్నిహితంగా కనిపించిన విషయం నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై నెట్టింట వీడియోలు, ఫోటోలు, కామెంట్లు, మీమ్స్ అవిరామంగా పుట్టుకొస్తున్నాయి. ఈ సమయంలో బైరాన్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది!

అవును... హెచ్‌ఆర్‌ డిపార్ట్ మెంట్ లోని ఆఫీసర్‌ క్రిస్టిన్‌ కాబోట్‌ ను ఆండీ బైరాన్ ఆలింగనం చేసుకొని, ముద్దాడుతూ కెమెరా కంటపడిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఉలిక్కిపడి ఇద్దరు విడిపోయి ముఖం దాచుకున్నారు. దీంతో స్పందించిన యాంకర్... వారు రిలేషన్ లో అయినా ఉండి ఉండాలి.. లేదా సిగ్గుతో అయినా దాక్కొని ఉండాలి’’ అని కామెంట్‌ చేశారు.

ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారగా... సంస్థ స్పందించింది. దీంతో సీఈవో ఆండీ బిరాన్‌ ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. ఈ క్రమంలో ఆండీ బిరాన్ తన సీఈవో పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ రాజీనామాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించినట్లు వెల్లడించింది.

ఈ విషయంపై డైరెక్టర్ల బోర్డు అధికారిక దర్యాప్తును ప్రారంభించిందని పేర్కొంది. ఇదే సమయంలో... దర్యాప్తు సమయంలో బైరాన్ తన విధుల నుంచి తప్పుకోవడంతో.. సంస్థ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పీట్ డిజాయ్ ను తాత్కాలిక సీఈవోగా నియమించారు.

కాగా... అండీ బైరాన్, క్రిస్టిన్ కాబోట్ విడివిడిగా ఇప్పటికే వివాహితులు. ఇందులో భాగంగా... ఆస్ట్రానమర్‌ సీఈవో ఆండీ బైరాన్ కి మేగన్‌ కెర్రిగాన్‌ తో ఇప్పటికే వివాహమవ్వగా.. ఇక క్రిస్టిన్‌ కాబోట్‌ కు ప్రైవేటీర్‌ రమ్‌ సీఈవో ఆండ్రూ కాబోట్‌ తో పెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలోనే విషయం మరింత వైరల్ గా మారింది.

మరోవైపు... బైరాన్ – క్రిస్టిన్ వ్యవహారం గురించి 'ది సింప్సన్స్' పాత ఎపిసోడ్ లలో ఈ క్షణాన్ని ముందే ఊహించారంటూ ఓ ప్రచారం సోషల్ మీడియా వేదికగా మొదలైంది. ఇందులో భాగంగా.. 2017 ఎపిసోడ్‌ లో ఈ సన్నివేశం ఉందని చెబుతూ పలు ఫోటోలు షేర్ చేస్తున్నారు. అయితే.. నిశితంగా పరిశీలిస్తే వైరల్ అవుతున్న కొత్త పిక్ ఏఐ సృష్టించబడిందని మరికొందరు అంటున్నారు.

Tags:    

Similar News