సె*క్సుకు 18 ఏళ్లు పక్కా.. తేల్చేసిన కేంద్రం

పద్దెనిమిదేళ్లు దాటిన వారే లైంగిక చర్యకు సమ్మతి తెలిపేందుకు అర్హులన్న రూల్ ను సవరించటం కుదరదన్న విషయాన్ని మోడీ సర్కారు తేల్చేసింది.;

Update: 2025-08-08 04:57 GMT

కీలక ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం నో చెప్పేసింది. పద్దెనిమిదేళ్లు దాటిన వారే లైంగిక చర్యకు సమ్మతి తెలిపేందుకు అర్హులన్న రూల్ ను సవరించటం కుదరదన్న విషయాన్ని మోడీ సర్కారు తేల్చేసింది. ఇప్పటివరకు శృంగారానికి ఆమోదం తెలిపేందుకు పద్దెనిమిదేళ్ల వయసును పరిమితిగా పెట్టటం తెలిసిందే. ఈ నిబంధనను మార్చాలని.. మారిన కాలానికి అనుగుణంగా దీన్ని పదహారేళ్లకు కుదించాలని కోరుతూ తెరపైకి వచ్చిన ప్రతిపాదనకు కేంద్రం నో చెప్పేసింది.

లైంగిక చర్యకు ఓకే చెప్పేందుకు ఇప్పుడున్న పద్దెనిమిదేళ్ల నుంచి పదహారేళ్లకు తగ్గించాలంటూ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేస్తున్న వాదనపై కేంద్రం స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. అంతేకాదు.. తాను ఈ విషయంలో ఆమె ప్రతిపాదనకు నో చెప్పటానికి ఉన్న కారణాన్ని వెల్లడించింది. మైనార్టీ తీరని వారిని లైంగిక మోసాలు.. దోపీడీల నుంచి కాపాడటమే ఈ విధాన నిర్ణయానికి కారణమని పేర్కొంది.

యువతీయువకుల శృంగారభరిత అంశాల్ని ప్రేమ పేరుతో వయో పరిమితిని తగ్గించటం సరికాదన్న కేంద్రం.. వయోపరిమితిని తగ్గించటం చట్టవ్యతిరేకమే కాదు.. ప్రమాదకరమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి తన వైఖరిని కోర్టుకు స్పష్టం చేశారు. పిల్లల మౌనాన్ని.. భావోద్వేగాలను అసరాగా చేసుకొని లైంగిక దురాగతాలకు పాల్పడే వారిని ఇప్పుడున్న నిబంధన కట్టడి చేస్తుందని అభిప్రాయ పడ్డారు. పద్దెనిమిదేళ్లుగా ఉన్న పరిమితిని పదహారేళ్లకు తగ్గిస్తే.. దాన్ని అవకాశంగా తీసుకొని పిల్లల అక్రమ రవాణా.. బాలలపై నేరాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో పదహారేళ్లకే లైంగిక చర్యకు సమ్మతి తెలిపే ప్రతిపాదనకు నో చెప్పేశారు.

Tags:    

Similar News