బ్రేకింగ్... చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం!

అవును... తాజాగా రాజమండ్రిలో జరుగుతున్న సభలో వేదికపై ఒక్కసారిగా గందరగోళం నెలకొనడం.. స్టేజిపైకి ఒక్కసారిగా కార్యకర్తలంతా దూసుకురావడం.

Update: 2024-01-29 11:43 GMT

చంద్రబాబుకు ఇటీవల ప్రమాదాలు తృటిలో తప్పుతున్నాయి! ఇందులో భాగంగా ఇటీవల "రా.. కదలిరా" సభకు అరకు బయలుదేరిన ఆయన ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ నిర్దేశించిన మార్గంలో కాకుండా మరొక మార్గంలో ప్రయాణించడం.. ఈ విషయాన్ని గ్రహించిన ఏటీసీ హెచ్చరికలు జారీచేయడం.. ఈ హెచ్చరికలతో హెలీకాప్టర్ వెనుదిరగడం.. తర్వాత అరకు చేరుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రాజమండ్రిలో మరో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు బాబు.

అవును... తాజాగా రాజమండ్రిలో జరుగుతున్న సభలో వేదికపై ఒక్కసారిగా గందరగోళం నెలకొనడం.. స్టేజిపైకి ఒక్కసారిగా కార్యకర్తలంతా దూసుకురావడం.. దీంతో స్టేజ్ మొత్తం నిండిపోవడం.. దీంతో ఒక్కసారిగా తోపులాట జరగడం.. ఫలితంగా.. చంద్రబాబు స్టేజ్ పై నుంచి కిందపడిపోబోవడం జరిగింది. దీంతో... ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అయితే సెక్యూరిటీ అలర్ట్ గా ఉండటంతో పెను ప్రమాదమే తప్పింది.

వివరాళ్లోకి వెళ్తే... ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా "రా.. కదలిరా" సభల్లో చంద్రబాబు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కాతేరులో "రా.. కదలిరా" సభ నిర్వహించారు. అయితే ఈ సమయంలో... చంద్రబాబు ప్రసంగం ముగిసీ ముగియగానే పెద్ద ఎత్తున కార్యకర్తలు వేదికపైకి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఇదే సమయంలో... రాజానగరం టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ వర్గీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు! ఎటువంటి చర్చలు, ముందస్తు సమాచారాలు, కార్యకర్తల అభిప్రాయాలు ఏమీ లేకుండానే రాజానగరం అసెంబ్లీ టికెట్ జనసేనకు ప్రకటించడంపై స్థానిక టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ వర్గీయులు ఫైరయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలో చంద్రబాబు ప్రసంగం అనంతరం అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి దూసుకువచ్చారు. దీంతో... ఒక్కసారిగా భారీగా తోపులాట జరిగింది.. పైగా స్టేజ్ కూడా చిన్నగా ఉండటంతో చంద్రబాబు కిందపడబోయారు.

Read more!

అయితే ఆ సమయంలో పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యి కిందపడకుండ పట్టుకోవడంతో చంద్రబాబుకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఒకవేళ స్టేజ్ పై నుంచి చంద్రబాబు కాలుజారి కిందపడి ఉంటే.. పరిస్థితి వేరుగా ఉండేదని అంటున్నారు ఆ సమయంలో అక్కడున్నవారు! ఈ నేపథ్యంలో... తోపులాటపై చంద్రబాబు సీరియస్ అవ్వడంతోపాటు.. కార్యకర్తల తీరుపై అసహనం వ్యక్తం చేశారని తెలుస్తుంది!


Tags:    

Similar News