• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కుల గణనలో అడిగే ప్రశ్నలు...

కుల గణనలో అడిగే ప్రశ్నలు ఇవే.. కులం అడిగితే చెప్పకపోతే ఏమవుతుంది?

| కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మనదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి కులం గురించి అడుగుతారు.

By - Tupaki Desk
Update: 2025-05-03 19:30 GMT

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మనదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి కులం గురించి అడుగుతారు. అయితే, ఒకవేళ ఎవరైనా తమ కులం చెప్పడానికి ఇష్టపడకపోతే ఏమి జరుగుతుంది? ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి కొంతమంది మదిలో ఈ ప్రశ్న మెదులుతోంది. తమ కులం చెప్పకపోతే ఏమవుతుందో తెలుసుకోవడానికి ముందు, అసలు ఈ గణన ఎలా చేస్తారు. దీనికి సంబంధించిన చట్టాలు ఏమి చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.

ఈ కుల గణన పూర్తిగా డిజిటల్ విధానంలో ఉంటుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని విస్తృతంగా ఉపయోగిస్తారు. జియో-ఫెన్సింగ్ ద్వారా కులగణన జరుగుతుంది. ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ ఉంటుంది. ఇప్పటివరకు ఎస్సీ-ఎస్టీలకు మాత్రమే ఒక కాలమ్ ఉండేది. ఎందుకంటే వారి గణన మాత్రమే జరిగేది. ఇప్పుడు ఓబీసీ ఉప-వర్గాల కాలమ్‌పై కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ గణనలో దాదాపు 30 ప్రశ్నలు అడుగుతారు. సామాజిక, ఆర్థిక స్థితి కూడా దీని ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ గణన కోసం ప్రత్యేక చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి. ఇది జనగణన చట్టం 1948 ప్రకారం నిర్వహిస్తారు.

తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు:

* మీ వయస్సు ఎంత?

* మీరు స్త్రీనా లేదా పురుషుడా?

* మీకు వివాహం అయిందా లేదా?

* మీరు ఎంతవరకు చదువుకున్నారు?

* మీరు ఏమి చేస్తారు (ఉద్యోగం)?

* మీరు ఎక్కడ నివసిస్తున్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు?

* మీరు ఇక్కడ ఎంత కాలం నుండి నివసిస్తున్నారు?

* తప్పుడు సమాచారం ఇస్తే రూ.1000 జరిమానా కూడా విధిస్తారు.

సమాధానం చెప్పడం తప్పనిసరి కాని ప్రశ్నలు:

* మీ మతం ఏమిటి?

* మీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు?

* మీ ఆరోగ్యం, వైకల్యానికి సంబంధించిన వ్యక్తిగత ప్రశ్నలు

* ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత గుర్తింపు పత్రాలు

ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు జనగణన చట్టంలో కులం చెప్పడం తప్పనిసరి కాదు. కేవలం ఎస్సీ-ఎస్టీల గురించి మాత్రమే అడిగేవారు. కానీ ఇప్పుడు కుల గణన జరగబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరి కులం అడుగుతారు. కులం చెప్పడం తప్పనిసరి చేయాలా లేదా ఐచ్ఛికంగా ఉంచాలా అనే దానిపై ఇంకా ఎటువంటి చట్టం లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో నోటిఫికేషన్ జారీ చేసి చట్టం చేసిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది.

Tags:    
  • CasteCensus 
  • India2025 
  • GovernmentPolicy 
  • CitizenRights 
  • SocialJustice 
  • IndianCensus 
  • OBCReservation 
  • DigitalCensus 
  • DataPrivacy 
  • CivicAwareness 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS