దీపావళికి సెలవు.. ఆ దేశ నిర్ణయంపై హర్షం..
భారతీయ సంప్రదాయాల ‘కాంతి’ ఇప్పుడు అమెరికా నేలపై వెలుగులు విరజిమ్ముతోంది. కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం దీపావళిని అధికారిక సెలవుదినంగా ప్రకటించింది.;
ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా అక్కడ భారత మూలాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల అరబ్ కంట్రీస్ లోని ఒక దేశంలో శివలింగం బయటపడింది. గతంలో సరస్వతీ అమ్మవారి విగ్రహం.. ఇలా చాలా దేశాల్లో చాలా విగ్రహాలు బయటపడ్డాయి. దీనిని బట్టి ఆలోచిస్తే.. ఒకప్పుడు ప్రపంచం మొత్తం సనాతన ధర్మం మాత్రమే ఉండేదని తెలుస్తోంది. అప్పుడు సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తంగా ఉంటే.. ఇప్పుడు భారత సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.
భారతీయులు లేని దేశం ఉందా..?
ఒక్కసారి ఆలోచించండి ప్రపంచంలో భారతీయులు లేదని దేశం ఎన్ని ఉన్నాయి. కేవలం వేళ్లపై మాత్రమే లెక్కించవచ్చు. ప్రతి దేశంలో భారతీయులు ఉన్నారు. లేదంటే వారి పూర్వీకులు ఉండి ఉంటారు. అందుకే భారత సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఇక భారతీయుల పండుగల్లో భక్తి, విశ్వాసం, ప్రకృతి ఆరాధణ, లాంటివే ఎక్కువగా ఉంటాయి. అందుకే భారతీయుల పండుగలకు ఎక్కువ గౌరవం ఉంటుంది.
అమెరికా నేలపై భారతీయ పండుగ..
భారతీయ సంప్రదాయాల ‘కాంతి’ ఇప్పుడు అమెరికా నేలపై వెలుగులు విరజిమ్ముతోంది. కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం దీపావళిని అధికారిక సెలవుదినంగా ప్రకటించింది. ఇది భారతీయ సమాజానికి గర్వకారణమైనదిగా చెప్పుకోవచ్చు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తన రాష్ట్రంలో దీపావళి సెలవు ప్రకటించారు. ఒక హిందూ పండుగకు సెలవు ప్రకటించడమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన భారతీయ సాంస్కృతికి అమెరికా రాష్ట్రం ఇచ్చిన గౌరవంగా గుర్తించాలి.
చీకట్లను తొలగించే పండుగపై ఆసక్తి..
దీపావళి అంటే కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు అది చీకట్లపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా నిర్వహించుకుంటారు. మానవత్వం, సహనం, సానుకూలతకు ప్రతీకగా నిలుస్తుంది. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు వంటి విభిన్న మతాల ప్రజలు దీన్ని సంస్కృతి, భక్తి, సామరస్యానికి చిహ్నంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా ప్రభుత్వం దీన్ని రాష్ట్ర సెలవుగా గుర్తించడం సాంస్కృతిక వైవిధ్యానికి ఇచ్చే గౌరవంగా భావించాలి.
పండుగకు దగ్గరగా చిన్నారులు..
కాలిఫోర్నియాలో వేలాది మంది భారతీయులు, భారతీయ-అమెరికన్లు జీవిస్తున్నారు. ఐటీ, విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో వారు ప్రముఖంగా నిలిచారు. వీరి కృషి, శ్రమ, విలువలు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మారాయి. ప్రభుత్వం ప్రకటించిన ఈ సెలవు ఆ సమాజం కృషికి గుర్తింపుగా నిలుస్తోంది. విద్యా, వాణిజ్య కేంద్రాలు ఆరోజు మూసి ఉంటాయి కాబట్టి భారత మూలాలున్న కుటుంబాలు తమ పిల్లలకు సంస్కృతిని మరింత దగ్గరగా పరిచయం చేసే అవకాశం ఉంటుందని ఇండో-అమెరికన్ అంటున్నారు. దీనిపై స్థానిక నాయకులు సైతం సంతోషం వ్యక్తం చేశారు.
ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా..
ఈ నిర్ణయం, అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు కూడా ప్రేరణగా మారే అవకాశం ఉంది. న్యూయార్క్, న్యూ జెర్సీ వంటి రాష్ట్రాలు ఇప్పటికే దీపావళిని గుర్తించాయి. కాలిఫోర్నియా ఇప్పుడు ఆ జాబితాలో చేరడం గ్లోబల్ స్థాయిలో భారతీయ సాంస్కృతిక ప్రభావాన్ని చూపిస్తుంది. సమాజం అంతా సమానంగా భావించే భావజాలాన్ని బలపరుస్తూ.. ఈ నిర్ణయం ‘వైవిధ్యంలో కూడా ఏకత్వం’ అనే భారతీయ తత్త్వాన్ని చాటుతోంది. దీపావళి ఇక భారతీయ పండుగ మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సానుకూలతకు ప్రతీకగా మారిన అంతర్జాతీయ ఉత్సవంగా నిలుస్తోంది.