10,000 సుమారు రూ.7 లక్షలు.. ఈ డాలర్ గురించి తెలుసా..!

సింగపూర్ - బ్రూనై మధ్య 1967లో ఓ కీలకమైన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా... ఈ రెండు దేశాలు ఒకదానినొకటి కరెన్సీలను అంగీకరిస్తాయి.;

Update: 2025-12-15 09:30 GMT

దేశం సైజు ఎంత.. జనాభా ఎంత అన్నది ముఖ్యం కాదన్నయ్యా.. తమ కరెన్సీ విలువ ఎంత అన్నది ముఖ్యం అంటూ ఆసియా ఖండంలోని ఓ చిన్న ముస్లిం దేశం.. తన కరెన్సీ విలువను ఓ లెక్కన చూపిస్తోంది! కేవలం దాదాపు 2,250 చదరపు మైళ్ల విస్తీర్ణం.. 5 లక్షల లోపు జనాభా ఉన్న ఈ దేశం పేరు బ్రూనై దారుస్సలాం... ఇక్కడి కరెన్సీ బ్రూనై డాలర్. దీని లెక్క ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... సాధారణంగా ప్రపంచ దేశాల్లో పెద్ద కరెన్సీ అనగానే గుర్తుకు వచ్చేది అమెరికా డాలర్, యూరో. అయితే అంతకంటే విలువైన మస్కట్ ఒమన్ గురించీ తెలిసిందే! అయితే ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటైన బ్రూనై దేశ కరెన్సీ 10,000 డాలర్ నోటు విలువ భారతదేశంలో సుమారు రూ.7 లక్షల మూడు వేలు. తాజా నివేదికల ప్రకారం 1 బ్రూనై డాలర్ విలువ భారత కరెన్సీలో రూ.70 కంటే ఎక్కువే!

సింగపూర్ తో ఒప్పందం కీలకం!:

సింగపూర్ - బ్రూనై మధ్య 1967లో ఓ కీలకమైన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా... ఈ రెండు దేశాలు ఒకదానినొకటి కరెన్సీలను అంగీకరిస్తాయి. ఈ ఒప్పందమే బ్రూనై కరెన్సీపై మరింత నమ్మకాన్ని పెంచిందని చెబుతారు. ఈ క్రమంలోనే నేటికీ సింగపూర్ డాలర్, బ్రూనై డాలర్ ఒకే రేటులో ఉంటాయి. ఈ బ్రూనై కరెన్సీని.. బ్రూనై దారుస్సలాం సెంట్రల్ బ్యాంక్ (బీడీసీబీ) జారీ చేస్తుంది.

ఇక ఈ బ్రూనై కరెన్సీలో ఎక్కువగా 1, 5, 10, 50, 100 డాలర్లుగా ఉంటాయి. ఇక అధిక డినామినేషన్ల విషయానికొస్తే వాటి సంఖ్య $500, $1000 ఉంటాయి. ఇవి రోజువారీ లావాదేవీలకు అరుదుగా ఉపయోగిస్తారు. ఇక $10,000 నోటును గతంలో జారీ చేసినప్పటికీ.. మనీలాండరింగ్ వంటి ఆర్థిక నేరాల ప్రమాదాలను తగ్గించడానికి ఇటీవల బీడీసీబీ వాటిని ఉపసంహరించుకునే ప్రక్రియలో ఉందని తెలుస్తోంది.

బ్రూనై దేశం చమురు, గ్యాస్ ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. దానికి ఉన్న సమృద్ధిలో ప్రధానంగా సహజ వనరులతో పాటు వివేకవంతమైన ఆర్థిక నిర్వహక కలిసి బ్రూనై డాలర్ స్థిరత్వానికి కారణాలుగా ఉన్నాయి.

Tags:    

Similar News