షర్మిలకు ఓటు వేయమని అడగనన్న బ్రదర్ అనిల్!

క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ రాజకీయాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Update: 2024-04-30 04:39 GMT

క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ రాజకీయాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఆయన చెప్పే మాటలకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం గమనార్హం. తాను ఎప్పుడూ ఎవరికి ఓటు వేయమని చెప్పనన్న ఆయన.. చివరకు తన సతీమణి షర్మిలకు ఓటు వేయాలని కూడా తాను ఎవరినీ అడగటం లేదని పేర్కొన్నారు. దేవుడు ఎవరికీ అన్యాయం చేయడన్న ఆయన.. భగవంతుడు న్యాయం పక్షాన ఉంటారని పేర్కొన్నారు.

డబ్బుతో అసత్యాన్ని సత్యంగా మార్చలేమన్న ఆయన.. కొందరు డబ్బు..పదవి కోసం అమ్ముడుబోతారన్నారు. ఎవరేం చేసినా.. వాస్తవం ఏమిటో మనసుకు తెలుసన్న ఆయన.. ‘‘అన్యాయం చేసిన వారికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్ చేసినా.. దేవుడి సన్నిధిలో శిక్ష తప్పదు’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. ఆయన నోటి నుంచి వచ్చిన నర్మగర్భ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

వివేకా హత్య వ్యవహారం ఏపీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారటం.. ముఖ్యంగా కడప జిల్లాలో వైఎస్ వివేకా హత్య నేపథ్యంలో వైఎస్ ఫ్యామిలీ రెండుగా విడిపోవటం తెలిసిందే. ఎవరికి వారు తమదైన వాదనలు వినిపిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే వైఎస్ వివేకా హత్య అంశంపై బ్రదర్ అనిల్ స్పందించారు.

వివేకా మంచి నాయకుడని.. ఆయన హత్య చాలా బాధాకరమన్నారు. అంతిమ విజయం న్యాయానికే దక్కుతుందని అభిప్రాయపడ్డారు. పాలకులు డబ్బు వ్యామోహంతో కక్కుర్తి పడొద్దన్న ఆయన.. ‘‘నేనెప్పుడు ఒక వ్యక్తికి ఓటు వేయాలని దేవుడిని అడగను. షర్మిలకు ఓటు వేయాలని కూడా కోరటం లేదు.నేను నా కమ్యూనిటీ తరఫున నిలబడతాను’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Tags:    

Similar News