• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లవ్ మ్యారేజ్ చేసుకొని...

లవ్ మ్యారేజ్ చేసుకొని అత్తారింట్లో ఉన్న ఆమెను దాడి చేసి తీసుకెళ్లారు

| ప్రేమపెళ్లి చేసుకున్న ఒక యువతి అత్తారింటికి వెళ్లిన వేళ.. ఆమె తల్లిదండ్రులు.. బంధువులు దాడి చేసి బలవంతంగా లాక్కెళ్లిన ఉదంతం కలకలాన్ని రేపింది

By - Garuda Media
Update: 2025-09-25 03:57 GMT

కీసర పరిధిలో చోటు చేసుకున్న ఒక ఉదంతం షాకింగ్ గా మారింది. ప్రేమపెళ్లి చేసుకున్న ఒక యువతి అత్తారింటికి వెళ్లిన వేళ.. ఆమె తల్లిదండ్రులు.. బంధువులు దాడి చేసి బలవంతంగా లాక్కెళ్లిన ఉదంతం కలకలాన్ని రేపింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నర్సంపల్లిలో చోటు చేసుకుంది. ఇంతా చేస్తే బంధువుల అమ్మాయే కావటం.. వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని ఏడేళ్లుగా ప్రేమించుకున్న వేళ.. పెళ్లి అనంతరం చోటు చేసుకున్న ఉదంతం సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..

కీసర మండలం నర్సంపల్లికి చెందిన ప్రవీణ్ అదే గ్రామానికి చెందిన వరుసకు మరదలైన శ్వేతతో ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం వారు హైదరాబాద్ లో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారు సికింద్రాబాద్ లోనే ఉంటున్నారు. ఆరోగ్యం సరిగా లేకపోవటంతో భర్తతో కలిసి శ్వేత వారం క్రితం నర్సంపల్లికి చేరుకున్నారు.

ఊరికి వచ్చినట్లుగా తెలుసుకున్న శ్వేత తల్లిదండ్రులు.. బంధువులు కలిసి ప్రవీణ్ తల్లిదండ్రుల ఇంటికి కారులో వచ్చారు. వారిని ఆపే ప్రయత్నం చేయగా.. ప్రవీణ్ తల్లి.. సోదరుల కళ్లల్లో కారం చల్లి.. కత్తులతో కర్రలతో దాడి చేశారు. అనంతరం శ్వేత కాళ్లు.. చేతులు కట్టేసి బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది.

దాడి చేయటం.. శ్వేతను బలవంతంగా లాక్కెళ్లిన వైనం సీసీ కెమేరాలు నమోదయ్యాయి. బాధిత కుటుంబం పోలీసుల్ని ఆశ్రయించారు. తమపై దాడి చేసిన వారిని శిక్షించాలని.. శ్వేతను అప్పగించాలని కోరుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు విచారణ చేస్తున్నట్లు చెబుతున్నారు. శ్వేత కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉన్నట్లుగా ప్రవీణ్ కుటుంబీకులు వాపోతున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులుఅడ్డొచ్చిన యువకుడి కుటుంబ సభ్యుల కళ్లల్లో కారం చల్లి దాడి చేసిన యువతి తరుపు బంధువులుమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో 4 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ప్రవీణ్, శ్వేత అనే వ్యక్తులుప్రవీణ్ తండ్రి ఫిర్యాదు మేరకు… pic.twitter.com/fPDaUjC3zH

— Tupaki (@tupaki_official) September 24, 2025
Tags:    
  • HyderabadBrideKidnap 
  • LoveMarriage 
  • BrideKidnap 
  • Medchal 
  • హైదరాబాద్ వధువు అపహరణ 
  • మేడ్చల్ సంఘటన 
  • ప్రేమ పెళ్లి దాడి 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS