సరికొత్త సంచలనం... ఏమిటీ బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్?
అవును... అమెరికాలోని ఒక పేరెంట్ ప్రొడక్ట్ కంపెనీ, ఒక బోటిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ కలిసి కొత్త రకం ఐస్ క్రీమ్ రుచిని పరిచయం చేశాయి.;
ఓ ఐస్ క్రీమ్ అమ్మకాలు ఇప్పుడు అమెరికాలో సంచలనం సృష్టిస్తున్నాయి. షాపుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తున్న పరిస్థితి. ఈ ఐస్ క్రీమ్ రుచి వేరే లెవెల్ లో ఉందని జనం చెబుతూ, అవుట్ లెట్ల ముందు బారులు తీరుతున్నారు. సుమారు అన్ని ఫ్లేవర్లలోనూ అందుబాటులో ఉంటున్న ఈ ఐస్ క్రీమ్ స్పెషల్ ఏమిటి.. ఇందులో ఏమేమి వాడుతున్నారో ఇప్పుడు చూద్దామ్..!
అవును... అమెరికాలోని ఒక పేరెంట్ ప్రొడక్ట్ కంపెనీ, ఒక బోటిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ కలిసి కొత్త రకం ఐస్ క్రీమ్ రుచిని పరిచయం చేశాయి. ప్రస్తుతం ఈ ఐస్ క్రీమ్... ఇంటర్నెట్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ ఐస్ క్రీమ్ తల్లి పాల రుచిని పోలి ఉండేలా రూపొందించబడిందని, అన్ని ఫ్లేవర్లలోనూ దొరుకుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
టాయ్ మేకింగ్ కంపెనీ ఫ్రిదా, న్యూయార్క్ కు చెందిన ఆడ్ ఫెలోస్ ఐస్ క్రీమ్ మధ్య సహకారంలోని ఈ ఐస్ క్రీమ్ వైరల్ గా మారింది. ఈ సమయంలో... "బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీం" అనే పదాలు ఉన్న ట్రక్కును చూపించే ప్రమోషనల్ పోస్ట్ ఈ సంచలనాన్ని మరింత పెంచింది. బ్రూక్లిన్, మన్ హట్టన్, న్యూయార్క్ లో గల ఆడ్ ఫెలోస్ అవుట్ లెట్లల్లో ఇది అందుబాటులో ఉంటోంది.
అయితే... ఈ ఐస్ క్రీమ్ మానవ తల్లి పాల రుచిని అనుకరిస్తుంది.. కానీ, వాస్తవానికి ఇందులో అలాంటిది ఏమీ లేదని యూ.ఎస్.ఏ. టుడే నివేదించింది. అయితే... ఫ్రిదా విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ఈ ఐస్ క్రీమ్ లో పాలు, హెవీ క్రీమ్, స్కిమ్ మిల్క్ పౌడర్, చక్కెర, గుడ్డు సొనలు, ఇన్వర్ట్ షుగర్, గ్వార్ గమ్, సాల్టెడ్ కారామెల్ ఫ్లేవరింగ్ ఉంటాయి.
వీటితో పాటు హనీ సిరప్, లిపోసోమల్ బోవిన్ కొలొస్ట్రమ్, ఫుడ్ కలర్, 0.1% ప్రొపైల్ పారాబెన్ ఉంటాయి. ఇందులో లిపోసోమల్ బోవిన్ అనేది సాధారణంగా తల్లిపాలలో కనిపించే సప్లిమెంట్!
ఈ బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్.. తీపిగా, కొద్దిగా ఉప్పగా ఉంటుందని.. తల్లిపాల రుచిని గుర్తు చేస్తోందని.. హనీ సిరప్ వాడటం వల్ల తేనె రుచి కొంత ఉందని, స్మూత్ గా ఉంటుందని అంటున్నారు. ఇక బోవిన్ కొలొస్ట్రమ్ వాడటం వల్ల ఐస్ క్రీమ్ కొంత పసుపు రంగులో ఉంటోందని చెబుతున్నారు! ఈ ఐస్ క్రీమ్ ను వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేయొచ్చని సంస్థ ప్రకటించింది!