మోడీకి దీన్ని మించిన ప్ర‌మోషన్ ఉంటుందా?

అధికారంలో ఉన్న పార్టీల‌కు అనుకూలంగా, వ్య‌తిరేకంగా సినిమాలు తీయ‌డం ఎప్ప‌ట్నుంచో ఉన్న‌దే. కానీ కేంద్రంలో న‌రేంద్ర మోడీ స‌ర్కారు వ‌చ్చాక బీజేపీ భావ‌జాలానికి అనుకూలంగా సినిమాలు తీయ‌డం బాగా పెరిగిన మాట వాస్తవం.;

Update: 2026-03-20 18:30 GMT

అధికారంలో ఉన్న పార్టీల‌కు అనుకూలంగా, వ్య‌తిరేకంగా సినిమాలు తీయ‌డం ఎప్ప‌ట్నుంచో ఉన్న‌దే. కానీ కేంద్రంలో న‌రేంద్ర మోడీ స‌ర్కారు వ‌చ్చాక బీజేపీ భావ‌జాలానికి అనుకూలంగా సినిమాలు తీయ‌డం బాగా పెరిగిన మాట వాస్తవం. క‌శ్మీర్ ఫైల్స్, కేర‌ళ స్టోరీ.. ఇలా చాలా సినిమాల మీద ఈ ర‌క‌మైన ముద్ర వేసి విమ‌ర్శ‌లు చేశాయి ప్ర‌తిప‌క్ష పార్టీలు. కానీ ఆ పార్టీల ఐడియాల‌జీకి అనుకూలంగా కూడా బోలెడ‌న్ని సినిమాలు వ‌చ్చాయి. వ‌స్తూనే ఉన్నాయి. కాబ‌ట్టి బీజేపీని మాత్ర‌మే ఈ విష‌యంలో త‌ప్పుబ‌ట్ట‌లేం. ఐతే ఇలా ఏక‌ప‌క్షంగా ఒక భావ‌జాలంతో సినిమాలు తీయ‌డం కంటే.. వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌భావ‌వంతంగా చూపిస్తూ.. మ‌ధ్య‌లో అండ‌ర్ క‌రెంట్‌గా భావ‌జాలాన్ని జొప్పించ‌డం వ‌ల్ల జ‌రిగే ప్ర‌యోజ‌న‌మే వేరు. దురంధ‌ర్ ఈ కోవ‌కు చెందిన సినిమానే. దీన్ని బీజేపీ ప్రాయోజిత‌ ప్రాప‌గండా సినిమాగా చాలామంది మొద‌ట్నుంచి విమ‌ర్శిస్తున్నారు. కానీ ఆ సినిమా ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుని 1400 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది.

ఇప్పుడు దురంధ‌ర్-2 ఇంకా పెద్ద విజ‌యం సాధించ‌బోతోంది. ఈ సినిమా ప్ర‌భావం ప్రేక్ష‌కుల మీద మామూలుగా లేద‌ని.. అది ప్ర‌ద‌ర్శిత‌మవుతున్న థియేట‌ర్ల‌కు వెళ్లి చూస్తే అర్థ‌మ‌వుతుంది. న‌రేంద్ర మోడీ తొలిసారి ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేసే సీన్. ఆ త‌ర్వాత డీమానిటైజేష‌న్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే స‌న్నివేశం.. వీటికి వ‌చ్చిన స్పంద‌న చూస్తే ఆశ్చ‌ర్య‌పోకుండా ఉండ‌లేరు. ముఖ్యంగా ఫేక్ క‌రెన్సీతో ఇండియాను గ‌ట్టి దెబ్బ తీయాల‌ని పాకిస్థాన్‌లోని టెర్ర‌రిస్టు గ్రూప్‌లు పెద్ద ప్లాన్ వేస్తే.. పెద్ద నోట్ల ర‌ద్దుతో వారికి చెక్ పెట్టార‌ని చూపిస్తూ మోడీ స్పీచ్‌ను టీవీ తెర‌పై చూపించిన‌పుడు థియేట‌ర్లు హోరెత్తిపోతున్నాయి. అది ప్రేక్ష‌కుల‌కు ఒక గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇంకా మోడీ స‌ర్కారుకు మైలేజీ తెచ్చిపెట్టే చాలా సీన్లు ఇందులో ఉన్నాయి. వీటిలో కొన్ని ఎగ్జాజ‌రేష‌న్లు ఉండొచ్చు.. అబ‌ద్ధాలు కూడా ఉండొచ్చు.. కానీ చాలా వ‌ర‌కు ఈ సినిమాలోని ఎపిసోడ్లు మోడీకి, ఆయ‌న ప్ర‌భుత్వానికి మంచి మైలేజీ ఇస్తాయ‌న‌డంలో సందేహం లేదు. ఎన్ని కోట్లు పెట్టి ప‌బ్లిసిటీ చేసినా రాని ప్ర‌యోజ‌నం ఈ ఒక్క సినిమా వ‌ల్ల క‌లుగుతోంది అంటే అతిశ‌యోక్తి కాదు.

Tags:    

Similar News