భర్త కోసం ప్రచార రంగంలోకి బ్రాహ్మణి... సుడిగాలి పర్యటనలు స్టార్ట్!

ఈ క్రమంలో ఇప్పటికే.. చంద్రబాబు కోసం ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంటే.. లోకేష్ కోసం బ్రాహ్మణి రంగంలోకి దిగారు.

Update: 2024-04-22 10:58 GMT

ఏపీలో అసలు సిసలు ఎన్నికల సందడి మొదలైపోయింది. ఈ సమయంలో నేతలంతా నామినేషన్ల సందడితో పాటు ప్రచార కార్యక్రమాల్లోనూ బిజీగా ఉన్నారు. ఈ సమయంలో నేతలతో పాటు వారి వారి కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే.. చంద్రబాబు కోసం ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంటే.. లోకేష్ కోసం బ్రాహ్మణి రంగంలోకి దిగారు.


అవును... ఈ ఎన్నికల్లో మంగళగిరిలో ఎలాగైనా గెలవాలని బలంగా ఫిక్సయిన నారా లోకేష్... నియోజకవర్గనికే పరిమితమై ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కూడా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా... మంగళగిరి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాడేపల్లి స్త్రీశక్తి, మహిళామిత్ర, డ్వాక్రా సంఘాల మహిళలను ఈరోజు కలిశారు.

ఈ సందర్భంగా... మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం లోకేష్ 29 సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నారని, ఈ నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించడానికి తనవంతుగా ఇప్పటికే సహకారం అందిస్తున్నారని బ్రాహ్మణి చెబుతున్నారు. ఈ సందర్భంగా... స్త్రీశక్తి పథకంలోని లబ్ధిదారులతో మాట్లాడిన బ్రాహ్మణి అభివృద్ధి సంక్షేమం కావాలంటే నారా లోకేష్ ను గెలిపించాలని కోరారు.

అంతకుముందు మల్లె తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలతోనూ బ్రాహ్మణి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో... మహిళల ఆర్థిక అభివృద్ధికి లోకేష్ ఎంతో దోహదం చేస్తారని, తన ప్రతి విజయం వెనుక లోకేష్ ఉన్నారని బ్రాహ్మణి తెలిపారు! వీటికి సంబంధించిన విషయాలను తన ఎక్స్ లో వెల్లడించారు బ్రాహ్మణి.

Read more!

ఇందులో భాగంగా... మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి స్త్రీశక్తి, మహిళామిత్ర, డ్వాక్రా సంఘాల మహిళలను ఈరోజు కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా... మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం లోకేష్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వాటిలో స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళల స్వావలంబనకు చేయూతనిస్తున్నారని వెల్లడించారు.

ఇదే క్రమంలో... ఈ స్త్రీశక్తి పథకం కింద ఇప్పటి వరకు 32 బ్యాచ్ లుగా 1600 మందికి కుట్టు శిక్షణ ఇచ్చి... మిషన్లు కూడా అందజేశారని తెలిపారు. స్త్రీశక్తి మహిళల ఆదాయం పెంపుదలకు అధునాతన డిజైన్లలో తర్ఫీదు ఇచ్చి మార్కెట్ లింకేజి కూడా చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News