8 క్లాస్ పిల్లాడు.. కుక్క కరిచిన వేళ అదిరే పరిష్కారం కనుగొన్నాడు

ఎక్కువ శాతం రాత్రిళ్లు టూవీలర్ల మీద వెళుతున్నప్పుడు వీధికుక్కలు వెంట పడటం తెలిసిందే.;

Update: 2026-01-19 08:30 GMT

ఎక్కువ శాతం రాత్రిళ్లు టూవీలర్ల మీద వెళుతున్నప్పుడు వీధికుక్కలు వెంట పడటం తెలిసిందే. కార్ల వెంట పడినా.. పెద్ద ప్రమాదం ఉండదు. కానీ.. టూవీలర్ల మీద వెళ్లే వేళలో వీధికుక్కలు వెంట పడిన వేళ ప్రమాదాలు జరగటం.. కొన్నిసార్లు వాహనదారులపై దాడులకు పాల్పడే ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న ఎనిమిదో క్లాస్ చదివే విద్యార్థి ఒకరు.. తన మాదిరి మరెవరికీ జరగకుండా ఏం చేయొచ్చన్న దానిపై పరిశోధించి.. ఒక సొల్యూషన్ ను గుర్తించాడు.

మధ్యప్రదేశ్ లోని ఛింద్వాడా జిల్లా బోహనాఖైరీకి చెందిన ఎనిమిదో క్లాస్ విద్యార్థి ఆర్యన్ వర్మన్.. బైక్ మీద కూర్చొని వెళుతుండగా.. ఒక వీధి కుక్క అతడ్ని కరిచింది. ఆ విషయాన్ని అక్కడితో వదిలేయని ఆర్యన్.. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ఏం చేయొచ్చన్న దాని గురించి ఆలోచించాడు.

అందుకు తగ్గట్లే.. వాటర్ ప్రెజర్ సిస్టమ్ ను రూపొందించాడు. దీని ద్వారా వీధికుక్కల దాడిని నిరోధించొచ్చన్నది అతడి మాట. ఈ విధానంలో వాటర్ కూలర్లలో వాడే ఒక చిన్న వాటరు పంపును బైక్ చుట్టూ ఏర్పాటు చేశాడు. ప్రయాణంలో ఎప్పుడైనా కుక్కలు వెంట పడితే.. ఏ వైపు నుంచి మీదకు వస్తాయో చూసుకొని.. ఆ వైపు ఉన్న పైపుల్ని యాక్టివేట్ చేసేలా బటన్ ను నొక్కాల్సి ఉంటుంది.

బటన్ నొక్కగానే ఒత్తిడితో నీరు వేగంగా వచ్చి కుక్కలపై పడుతుంది. నీటి ధార తగిలినంతనే కుక్కలు వెనేక్కు తగ్గుతాయి. ఈ విధానానికి స్మార్ట్ మోటార్ సైకిల్ ఫర్ హర్మ్ ఫుల్ యానిమల్ పేరు పెట్టిన ఆర్యన్.. పలువురికి ఈ విధానాన్ని చూపిస్తున్నాడు. ఆర్యన్ ఆలోచనకు స్కూల్ యజమాన్యం తోడ్పాటు అందించినట్లు చెబుతున్నారు. ఏమైనా.. ఈ తరహాలో టూవీలర్ కంపెనీలు కొత్త ఫీచర్ ను ఏర్పాటు చేస్తే.. లక్షలాది మందికి వీధికుక్కల వెంబడించే ముప్పును నుంచి తప్పించినట్లు అవుతుంది.

Tags:    

Similar News