• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీజేపీలో ఇంత అయోమయమా ?

బీజేపీలో ఇంత అయోమయమా ?

| ఇక్కడే ఇంకో ట్విస్టు చోటుచేసుకుంది. అదేమిటంటే జాబితాలో పేర్లుండటంతో ఖుషీ అయిపోయిన నేతలకు షాకిస్తు పార్టీ మరికొందరి పేర్లను మళ్ళీ మార్చేసింది.

By - Tupaki Desk
Update: 2023-11-11 05:38 GMT

అసలే గట్టి అభ్యర్ధుల కొరతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణా బీజేపీ చివరకు జాబితాలను ఫైనల్ చేయటంలో కూడా అయోమయానికి గురవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. కొందరు నేతలకు ఫోన్లు చేసి అభ్యర్ధులుగా ఎంపికయ్యారని చెప్పి సీనియర్ నేతలు కొందరు అభినందనలు తెలిపారు. దాంతో అభ్యర్ధులుగా ఎంపికైనట్లు తెలుసుకుని సదరు నేతలు పిచ్చ హ్యాపీ అయిపోయారు. అయితే జాబితాలో చూస్తే కొదరి పేర్లు కనబడలేదు. సీనియర్లు ఫోన్లుచేసి అఢభినందించి జాబితా తయారుచేసి రిలీజ్ చేసే మధ్య టైంలోనే కొందరి పేర్లు మారిపోయాయి.

ఇక్కడే ఇంకో ట్విస్టు చోటుచేసుకుంది. అదేమిటంటే జాబితాలో పేర్లుండటంతో ఖుషీ అయిపోయిన నేతలకు షాకిస్తు పార్టీ మరికొందరి పేర్లను మళ్ళీ మార్చేసింది. దాంతో పార్టీలో ఏమి జరుగుతోందో అర్ధంకాక నేతలు, అభ్యర్ధుల్లో అయోమయం పెరిగిపోయింది. 10వ తేదీన నామినేషన్లకు చివరి తేదీ అని తెలిసి కూడా చివరినిముషం వరకు నేతల పేర్లను పరిశీలిస్తునే ఉండటం, సీనియర్లు కొందరికి ఫోన్లుచేసి అభినందించటం, జాబితాలో పేర్లు కూడా మారిపోవటంతోనే అయోమయం పెరిగిపోయింది.

వనపర్తి స్ధానాన్ని ముందు ఆర్టీసీ జేఏసీ మాజీ ఛైర్మన్ అశ్వత్థరెడ్డికి ప్రకటించింది. అయితే చివరి నిముషంలో అనూగ్నరెడ్డికి కేటాయించింది. కొయ్యల ఏమాజికి బెల్లంపల్లి టికెట్ ఖాయంచేసినట్లు సీనియర్ నేతలు ఫోన్లు చేసి అభినందించారు. మరికొందరేమో మాజీ ఎంఎల్ఏ శ్రీదేవికి అభినందనలు చెప్పారు. అయితే జాబితాలో మాత్రం ఏమాజి పేరుంది. అయితే మళ్ళీ జాబితాను మార్చేసి శ్రీదేవిని ప్రకటించారు. వీళ్ళే కాకుండా వేములవాడలో తులఉమకు టికెట్ ప్రకటించింది. అయితే చివరినిముషంలో సీహెచ్ వికాసరావుకు బీఫారం ఇచ్చేసింది. అలాగే సంగారెడ్డిలో టికెట్ ప్రకటించిన రాజేశ్వరరావు దేశ్ పాండేకు కాకుండా పులిమామిడి రాజుకు బీఫారం అందించింది.

ముందొక పేరు, సీనియర్ల అభినందనలు మరొకరికి, చివరకు జాబితాలో ఇంకో పేరు, మళ్ళీ అదికూడా మారిపోవటం లాంటివి బీజేపీలో గందరగోళ పరిస్ధితులను తెలియజేస్తోంది. సీనియర్లు కొందరు తమ మద్దతుదారుల కోసం పట్టుబట్టడం, చివరకు రాజీపడటం, మళ్ళీ పట్టుబట్టడం లాంటి కారణాలతోనే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్ధుల పేర్లు మారినట్లు బీజేపీలో కూడా మారిపోయిందని సమాచారం. కాంగ్రెస్ లో అంటే నియోజకవర్గంలో గట్టి అభ్యర్ధులు అనుకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు టికెట్ కోసం పోటీపడటంతో ఇలాంటి పరిస్ధితులు కనిపించాయి. మరి బీజేపీలో కూడా టికెట్ల కోసం అంత సీనుందా ?

Tags:    
  • Bjp 
  • Tselections 
  • Vanaparthi 
  • Aswathreddy 
  • Anugnareddy 
  • Bellampally 
  • Balaji 
  • Telangana 

Similar News

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

Copyright @2026

Powered by Blink CMS