మమత మాజీ...బీజేపీకి మహదానందం!

మొత్తానికి మమతా దీదీని అలా తీసి పక్కన పెట్టేసింది బీజేపీ. ఆమె సామాన్యురాలు కాదు. కానీ బీజేపీ వ్యూహం ముందు చిత్తు అయ్యారు.;

Update: 2026-05-04 09:16 GMT

మొత్తానికి మమతా దీదీని అలా తీసి పక్కన పెట్టేసింది బీజేపీ. ఆమె సామాన్యురాలు కాదు. కానీ బీజేపీ వ్యూహం ముందు చిత్తు అయ్యారు. మమతా 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అంతకు ముందు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పీఠం కోసం ఏకంగా 13 ఏళ్లపాటు అప్రతిహతంగా పోరాటం చేశారు. ఆనాడు బలమైన వామపక్ష ప్రభుత్వాన్ని ఆమె ధీటుగా ఎదుర్కొన్నారు. ఒక మహిళా నాయకురాలి గా ఆమె విపక్షంలో ఉన్నపుడు ఎంతగానో శ్రమించారు. 2006లో నందిగ్రామ్ లో జరిగిన ఉద్యమంలో మమత చేసిన పోరాటం జాతీయ స్థాయిలో అతి పెద్ద చర్చగా మారింది. దాంతో మమతా బెనర్జీ పట్ల పశ్చిమ బెంగాల్ ప్రజలలో కూడా సానుకూల అభిప్రాయం ఏర్పడింది. వామపక్ష ప్రభుత్వం అప్పటికే అధికారంలోకి వచ్చి మూడు దశాబ్దాలు దగ్గరవుతున్న వేళ ఒక ఆల్టర్నేషన్ కోసం వెతుకుతున్న సందర్భంగా మమత కలకత్తా కాళీగా బెంగాల్ ప్రజలకు కనిపించారు.

కామ్రేడ్స్ ని దించేశారు :

దాంతో ఆమె తరువాతే ఎన్నికల్లో మంచి స్థానాలలో విజయం సాధించారు. విపక్షంలో చేరి అయిదేళ్ళు గట్టిగా పోరాడారు. ఇక 2011 వచ్చేటప్పటికి ఆమె ఏకంగా వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చి ముఖ్యమంత్రి అయిపోయారు. ఆ తర్వాత 2016 లో మరో మారు మమత మ్యాజిక్ అద్భుతంగా పనిచేసింది. ఆమె రెండోసారి ముఖ్యమంత్రిగా అద్వితీయ విజయం సాధించారు. ఈసారి కూడా ఆమె విజయం నల్లేరు మీద నడక మాదిరిగా సాగిపోయినిద్. ఇక 2021 నుంచే ఆమెకు కాషాయం పార్టీతో కష్టాలు మొదలయ్యాయి. 2021 ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ మమత ఇచ్చింది నిజానికి చెప్పాలంటే ఆ ఎన్నికల్లో మమత గురించి బీజేపీ చేసిన ప్రచారం తామే అధికారంలోకి వస్తామని అంతగా హైప్ క్రియేట్ చేసుకున్న తీరుతో చివరికి చతికిలపడాల్సి వచ్చింది. అయినప్పటికీ చివరికి బిజెపి 77 సీట్ల దాకా ఆ ఏన్నికల్లో సాధించి ప్రతిపక్షానికి పరిమితమైపోయింది.

సైలెంట్ గానే అంతా :

ఇక బీజేపీ 2021 ఎన్నికల తరువాత మమతని దించేందుకు అవసరమైన వ్యూహాలను అన్నీ సిద్ధం చేసుకుంటూ చాలా సైలెంట్ గా పనిచేసింది. మమతా బెనర్జీ అయితే తనకు 2021 ఎన్నికల్లో లభించిన 216 సీట్లను చూసుకుని తనకు ఇక తిరుగులేదనుకునే స్థాయికి వెళ్లారు. ఆ రకమైన ఆలోచనలతో మమతా బెనర్జీ బెంగాల్లో గత ఐదేళ్ల పరిపాలన చేశారు. ముఖ్యంగా ఈ ఐదేళ్ల కాలంలో శాంతిభద్రతల ఇష్యూలో ఆమె పూర్తిగా వైఫల్యం చెందారు అన్నది స్థానికంగా ఉనన్ భావన. అదే సమయంలో ఓటమి తర్వాత కసిగా బిజెపి పని చేయడం జరిగింది. ఈసారి ఓడించాలని పట్టుదలతో బిజెపి అండర్ గ్రౌండ్ వర్క్ చేసింది. ఎక్కడ హైప్ క్రియేట్ చేయలేదు. 2021 లో బీజేపీ చేసిన ఆర్భాటానికి భిన్నంగా ఒక వ్యూహం ప్రకారం ఈసారి బిజెపి గట్టిగా గ్రౌండ్ వర్క్ చేసింది. బిజెపి మమతా బెనర్జీ చాలా పగడ్బందీగా ఈసారి కట్టడి చేసింది. సర్ ప్రక్రియతో మమతకు ముందర కాళ్ళకు బంధం వేసింది. . అక్రమ చొరబాట్ల మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. శాంతి భద్రతల మీద జనంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దాంతో బిజెపి తొలిసారిగా అధికార పగ్గాలు అందుకోబోతోంది.

డబుల్ బొనాంజా :

ఈ విజయం బీజేపీకి డబుల్ బొనాంజా గా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మమతా బెనర్జీ కేవలం బెంగాలి కే పరిమితమైన నాయకురాలు కాదు. ఆమె జాతీయ స్థాయిలో కూడా బిజెపికి గట్టిగా టార్గెట్ చేసే ధీటైన నేతగా ఉన్నారు. ఒక విధంగా ఇండియా కూటమిలో కానీ ఒక పెద్ద నాయకుడు ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న కీలక నాయకురాలిగా ఆమె ఉన్నారు. వరుసగా నాలుగోసారి కనుక గెలిచినట్లయితే కేంద్రంలో నేరుగా బిజెపితో ఢీ కొట్టి అధికార పీఠానికి పోటీ పడే స్థాయిలో మమత ఉండేది. అలా బిజెపికి తరచూ చికాకుగా కూడా మమతా బెనర్జీని చాలా సైలెంట్ గా వ్యూహాత్మకంగా బిజెపి ఆమె ఉన్నచోటే అంటే పశ్చిమ బెంగాల్లోని ఆమె రాజకీయ జీవితాన్ని తాత్కాలికంగా కామ పెట్టేసింది. మొత్తానికి మమతా బెనర్జీ చీకాకు నుంచి బిజెపి పూర్తిస్థాయిలో తప్పించుకున్నట్లయింది. దాంతో బిజెపికి విజయం మహదానందం కలిగిస్తున్నది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Tags:    

Similar News