జేడీయూకు ఉప రాష్ట్రపతి...టీడీపీకి డిప్యూటీ స్పీకర్ ?
ఈ నేపథ్యంలో జేడీయూని తమతో ఉంచుకోవడం బీజేపీకి అత్యవసరంగా మారుతోంది.;
కేంద్రంలో బీజేపీ ఆచీ తూచీ అడుగులు వేస్తోంది అని అంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ కి చాలా దూరంలో ఆగిపోయిన బీజేపీకి ఆదుకుంటున్నది ఊత కర్ర సాయం అందిస్తోంది ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ, బీహార్ నుంచి జేడీయూ అన్నది తెలిసిందే. అందుకే ఈ రెండు పార్టీలకు ఎన్డీయే పెద్దలు ఎక్కడ లేని విలువ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే జేడీయూకి ఉప రాష్ట్రపతి పదవి దక్కబోతోంది అని అంటున్నారు. ఆ పార్టీకి ఇది అతి పెద్ద గౌరవంగా ఉంటుంది. అంతే కాదు ప్రాధాన్యత కూడా చాలా పెరిగినట్లే అని అంటున్నారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్ అవసరం బీజేపీకి చాలా ఉంది. బీహార్ లో ఇపుడు రాజకీయం ఎన్డీయేకు ఏమంత సుఖంగా లేదు. విపక్షాలు గట్టిగానే సవాల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జేడీయూని తమతో ఉంచుకోవడం బీజేపీకి అత్యవసరంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఉప రాష్ట్రపతి పదవిని బహుమానంగా ఇస్తున్నారు అని అంటున్నారు. దీని వల్ల నితీష్ కుమార్ కూటమికి కట్టుబడి ఉంటారని అంటున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు కూటములు వేరు, ఎన్నికల తరువాత రాజకీయ సన్నివేశాలు వేరు.
బీహార్ లో ఇలాంటివి చాలా జరిగాయి. పైగా గత అయిదేళ్ళలో నితీష్ రాజకీయ విన్యాసాలు దేశమంతా చూసింది. 2020లో బీజేపీతో ఎన్డీయేతో కలసి గెలిచి మధ్యలో ఇండియా కూటమికి వెళ్ళారు మళ్ళీ అటు నుంచి ఇటు మళ్ళారు. మరి బీహార్ లో అంకెల గారడి ఏలా ఉంటుందో తెలియదు బొటాబొటీగా నంబర్ వస్తే నితీష్ కుమార్ అత్యంత కీలకం అవుతారు. అందుకే ఆయన ముందర కాళ్ళకు బంధం వేసేందుకు బీజేపీ ఈ విధంగా దేశంలోనే అతి పెద్ద రెండవది అయిన రాజ్యాంగ పదవిని అందిస్తోంది అని అంటున్నారు.
మరో వైపు ఏపీలో టీడీపీని చంద్రబాబుని అలాగే చూసుకుంటున్నాబు. చంద్రబాబు వరకూ చూస్తే ఆయన పదవుల విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కేంద్రం దండీగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. అయితే గ్రాంట్స్ విషయంలో అనుకున్నంతగా సాయం అందిస్తోందా లేదా అన్నది పక్కన పెడితే పదవుల విషయంలో మాత్రం బీజేపీ తెలుగుదేశానికి న్యాయం చేస్తోంది అని అంటున్నారు.
ఇప్ప్పటికే ఒక గవర్నర్ పదవిని ఇచ్చిన బీజేపీ రానున్న కాలంలో మరో గవర్నర్ పదవిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంతే కాదు లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని టీడీపీకి ఇస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఆ పదవిని అమలాపురానికి చెందిన మాజీ స్పీకర్ గంటి మోహన చంద్ర బాలయోగి కుమారుడు కి దక్కుతుందని చెబుతున్నారు. మొత్తానికి నితీష్ ని చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవడంలో బీజేపీ సక్సెస్ అవుతోందని చెబుతున్నారు.