• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'సిగ్గులేనితనానికి ఓ ...

'సిగ్గులేనితనానికి ఓ పరిమితి ఉంటుంది!'... బీజేపీ ఎంపీపై ఎందుకంత కోపం?

| అవును... హర్యానా బీజేపీ రాజ్యసభ ఎంపీ రామచంద్ర జంగ్రా.. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై వివాదాస్పద ప్రకటన చేశారు.

By - Tupaki Desk
Update: 2025-05-25 04:02 GMT

రాజకీయ నాయకులు మైకుల ముందు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని అంటుంటారు! నలుగురిలో మాట్లాడేముందు నాలుకను అదుపులోకి పెట్టుకోకపోతే ఊహించని ప్రమాదాలను కొనితెచ్చుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంటారు! ఈ సమయంలో పహల్గాం ఉగ్రదాడిపై ఓ బీజేపీ ఎంపీ చేసిన వాఖ్యలు ఇప్పుడు రాజకీయ తుఫానుకు దారితీస్తున్నాయి!

అవును... హర్యానా బీజేపీ రాజ్యసభ ఎంపీ రామచంద్ర జంగ్రా.. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై వివాదాస్పద ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇది రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తుంది. ఇందులో భాగంగా.. పహల్గాంలో తమ భర్తలను కాలుస్తున్నప్పుడు మహిళలు ఉగ్రవాదులతో పోరాడాల్సిందని.. కానీ, వారిలో యోధుల స్ఫూర్తి లేదని, పోరాడలేదని అన్నారు.

ఒకవేళ ఆ సమయంలో ఉగ్రవాదులతో మహిళలు పోరాడి ఉంటే.. తక్కువ మంది చనిపోయి ఉండేవారని.. ఆ సమయంలో మహిళలు అహల్యాబాయి హోల్కర్, ఝాన్సీ రాణి లాగా ధైర్యాన్ని ప్రదర్శించాలని ఆయన మహిళలను కోరారు! అందుకే ప్రధాని మోడీ అగ్నివీర్ పథకాన్ని ప్రారంభించారని, ప్రతీ పర్యాటకుడు అగ్నివీర్ అయ్యి ఉండాల్సిందని అన్నారు!

అదే జరిగి ఉంటే వారంతా ఉగ్రవాదులను చుట్టుముట్టి ఉండేవారని.. అక్కడ నుంచి ఏ ఉగ్రవాదీ తిరిగి వెళ్లేవాడు కాదని చెప్పుకొచ్చారు! ఇదే సమయంలో... పహల్గాం దాడిలో నిందితులను పట్టుకోలేకపోవడంపై మాట్లాడిన ఆయన.. సైన్యం ఆ ఉగ్రవాదులను పట్టుకోలేకపోయినా, వారు దాక్కున్న ప్రదేశాలను, వారి యజమానులను ధ్వంసం చేసిందని తెలిపారు!

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ దీపేంద్ర సింగ్ హుడా స్పందించారు. ఈ సందర్భంగా జాంగ్రాపై తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో భాగంగా... పహల్గాంలో ఉగ్రవాదులు తమ భర్తలను చంపి, వీరి జీవితాలను నాశనం చేస్తే.. ఇప్పుడు ఈ బీజేపీ ఎంపీ వారి గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.. ఇది చాలా అసహ్యకరం, అమరవీరుల కుటుంబాలకు అవమానం అని అన్నారు!

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనాటే ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ బీజేపీ ఎంపీపై నిప్పులు చెరిగారు. ‘వీరి పార్టీ సింధూరం గురించి మాట్లాడుతుందా? సిగ్గులేనితనానికి ఒక పరిమితి ఉంటుంది!’ అంటూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు!

Tags:    
  • RamchandraJangra 
  • PahalgamAttack 
  • BJPControversy 
  • TerrorAttackIndia 
  • ModiGovernment 
  • AgniveerScheme 
  • CongressVsBJP 

Similar News

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

Copyright @2026

Powered by Blink CMS