• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నిజం కానున్న ఎగ్జిట్...

నిజం కానున్న ఎగ్జిట్ పోల్స్..స్పష్టమైన అధిక్యతలో బీజేపీ!

| ఢిల్లీ రాష్ట్ర కోట మీద కాషాయ జెండా ఎగరాలన్న కమలనాథుల కల తీరనుంది.

By - Tupaki Desk
Update: 2025-02-08 05:02 GMT

ఢిల్లీ రాష్ట్ర కోట మీద కాషాయ జెండా ఎగరాలన్న కమలనాథుల కల తీరనుంది. ఎప్పుడెప్పుడు ఢిల్లీ రాష్ట్రాన్ని సొంతం చేసుకోవాలని తపించిన ఇంతకాలానికి ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టేలా నిర్ణయం తీసుకున్నారా? అన్నట్లుగా తాజా ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బీజపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన స్థానాల కంటే ఎక్కువ చోట్ల అధిక్యతను ప్రదర్శిస్తోంది.

మొత్తం ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా.. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వివరాల్ని చూస్తే.. పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే ఉన్నాయి. శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతానికి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో మాత్రమే అధిక్యతను ప్రదర్శిస్తూ వెనుకబడి ఉండగా.. బీజేపీ కూటమి 45 స్థానాల్లో అధిక్యతను ప్రదర్శిస్తూ దూసుకెళుతోంది. ఇప్పటివరకు వెల్లడైన రౌండ్లలో మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అధిక్యతలను ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వానికి ఏర్పాటు చేయటానికి 36 స్థానాల్ని సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు వెల్లడైన ఓట్ల లెక్కింపు ప్రకారం చూస్తే.. మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందుకు వెళుతున్నారు.

అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అగ్రనేతలు క్రేజీవాల్, ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న అతిశీలతో సహా పలువురు తిరోగమనంలో పయనిస్తూ ఉండటం గమనార్హం. తొలి రౌండ్లలో కాంగ్రెస్ ఒక స్థానంలో అధిక్యతలో ఉండగా.. తొమ్మిదిన్నర గంటల సమయానికి ఆ ఒక్క స్థానంలోనూ వెనుకబడి ఉంది. దీంతో.. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు దారుణమైన షాక్ కు గురి చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా ఫలితాల ట్రెండ్ చూస్తే.. ఈసారికి బీజేపీ కల నెరవేరి.. ఢిల్లీ రాష్ట్రంలో కమలనాథుల ప్రభుత్వం కొలువు తీరుతుందన్నఅభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

Tags:    
  • DelhiElectionResults 
  • BJP 
  • AAP 
  • Congress 
  • DelhiPolitics 
  • DelhiElections 
  • ElectionTrends 
  • IndianPolitics 
  • Delhielections2025 
  • Politicalnews 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS