స్టాలిన్‌ వైపు... బీజేపీ చూపు: త‌మిళ‌నాట పొలిటిక‌ల్ సెగ‌!

పార్ల‌మెంటులో బీజేపీకి సంఖ్యా బ‌లం త‌క్కువ‌గా ఉండ‌డంతో కీల‌కమైన బిల్లుల‌ను ఆమోదించుకునేం దుకు ఇబ్బందులు ప‌డాల్సి వస్తోంది.

Update: 2026-08-06 10:16 GMT

పార్ల‌మెంటులో బీజేపీకి సంఖ్యా బ‌లం త‌క్కువ‌గా ఉండ‌డంతో కీల‌కమైన బిల్లుల‌ను ఆమోదించుకునేం దుకు ఇబ్బందులు ప‌డాల్సి వస్తోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు గ‌తంలో మిత్ర‌ప‌క్షాలుగా ఉండి.. ప్ర‌స్తుతం దూరంగా ఉన్న కొన్ని పార్టీల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తోంది. దీనిలో భాగంగా త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌వైపు.. బీజేపీ నేత‌లు చేస్తున్నారు. ఈ పార్టీకి లోక్‌స‌భ‌లో 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరు క‌నుక బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తే.. కీల‌క బిల్లుల నుంచి కేంద్ర గ‌ట్టెక్కుతుంది.

సాధ్య‌మేనా?

బీజేపీ చేస్తున్న ఈ రాజ‌కీయంతో త‌మిళ‌నాడు రాజ‌కీయాలు వేడెక్కాయి. ఏ మ‌హిళా బిల్లును, ఏ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల విభ‌జ‌న బిల్లును అధికారంలో ఉన్న‌ప్పుడు స్టాలిన్ వ్య‌తిరేకించారో.. ఇప్పుడు వాటికే మ‌ద్ద‌తు తెల‌పాల‌ని.. కేంద్ర మంత్రివ‌ర్గంలో చోటు ఇస్తామ‌ని బీజేపీ ఆఫ‌ర్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈ బిల్లుకు మద్దతు ఇస్తుందనే ప్రచారం మొదలైంది.

ఆ వెంట‌నే డీఎంకేలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. డీఎంకేకి చెందిన 15 మంది ఎంపీలు పార్టీ వైఖరిని వ్యతిరేకిస్తూ సీఎం విజయ్‌ను కలిసి చర్చలు జరిపారని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. దీంతో డీఎంకే అధిష్ఠానం పరిస్థితిని పునఃసమీక్షించింది. ఈ బిల్లుకు బీజేపీకి మద్దతు ఇస్తే తమిళనాడు ప్రజలకు చేసిన ద్రోహంగా ముద్రపడుతుందని, రాష్ట్ర రాజకీయాల్లో పార్టీకి కోలుకోలేని నష్టం జరుగుతుందని భావించి డీఎంకే పూర్తిగా వెనక్కి తగ్గిన‌ట్టు తెలుస్తోంది.

మరోవైపు రాజ్యాంగ సవరణకు అవసరమైన ప్రత్యేక మెజారిటీ బీజేపీకి లేకపోవడం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో డీఎంకే కూడా మద్దతు ఇవ్వబోదని స్పష్టమవడంతో మ‌రోవైపు.. వైసీపీ ఎంపీలను కేంద్రం సంప్ర‌దించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి ఆది నుంచి కూడా వైసీపీ ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా బీజేపీకి అనుకూల‌మేన‌న్న విష‌యం తెలిసిందే. దీంతో 11 మంది వైసీపీ ఎంపీలు కూడా కేంద్రానికి జై కొట్టారు. మిగిలిన ప‌క్షాల మ‌ద్ద‌తును ద‌క్కించుకోవ‌డంలో బీజేపీ విఫ‌ల‌మైంది.

Tags:    

Similar News