• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టీ సచివాలయంలో షాకింగ్...

టీ సచివాలయంలో షాకింగ్ సీన్.. ఎమ్మెల్యేకు చేదు అనుభవం!?

| తెలంగాణ సచివాలయంలో చోటు చేసుకున్న ఒక షాకింగ్ ఉదంతం సంచలనంగా మారింది.

By - Tupaki Desk
Update: 2024-11-23 05:22 GMT

తెలంగాణ సచివాలయంలో చోటు చేసుకున్న ఒక షాకింగ్ ఉదంతం సంచలనంగా మారింది. వీఐపీలు ఎక్కువగా ఉండే అక్కడ విధులు నిర్వర్తించే భద్రతా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా ఎమ్మెల్యే అన్నది కూడా చూడకుండీ తోసేసిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి చాంబర కు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెళుతున్నారు.

సచివాలయంలోని ఆరో అంతస్తులోకి వెళుతున్న సందర్భంలోనే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఒక రివ్యూకు హాజరై వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాలపై సమీక్షను నిర్వహించారు. ఈ రివ్యూకు హాజరైన ఆమె.. తిరిగి తన చాంబర్ వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలో సీఎస్ నడిచే మార్గానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా అక్కడ ఉన్న వారిని పక్కకు తోసేశారు.

వేం నరేంద్రరెడ్డిని కలిసేందుకు వెళుతున్న వనపర్తి ఎమ్మెల్యేను లాగేయటంతో ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తాను ఎమ్మెల్యేనని.. తానెవరో తెలుసుకోకుండా ఇలా తోసేయటమా? అని మండిపడ్డారు. అయినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది స్పందించకపోగా.. నిర్లక్ష్యంతో బదులిచ్చిన వైనంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే అన్న విషయం తమకు తెలీదన్న భద్రతా సిబ్బంది వ్యాఖ్యలు చూస్తే.. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దగ్గరకు వచ్చేస్తున్న వేళ.. ఎమ్మెల్యేల గురించి అవగాహన లేకుండా పోవటం దేనికి నిదర్శనం? అని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి సీఎం ఉండే ఆరో అంతస్తుకు వచ్చే వారంతా దాదాపుగా ప్రముఖులు.. ముఖ్యులు.. ప్రజాప్రతినిధులే ఉంటారు. అలాంటప్పుడు హైసెక్యూరిటీ జోన్ లో ఉండే ఒక ఎమ్మెల్యే పట్ల అలా దురుసుగా వ్యవహరించం ఎంతవరకు సబబు? అని ప్రశ్నిస్తున్నారు. తాజా ఉదంతంలో మేఘా రెడ్డికి జరిగినట్లే.. ఇటీవల కాలంలో పలువురి విషయంలోనే ఇలాంటివి చోటు చేసుకుంటున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Tags:    
  • Wanaparthy 
  • Wanaparthymla 
  • Thudimeghareddy 
  • Vemnarendrareddy 
  • Telangana 
  • Bhattivikramarka 
  • Revanthreddy 
  • Telanganapolitics 
  • Politicalnews 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS