• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తుపాకులతో కాల్చుకున్న ...

తుపాకులతో కాల్చుకున్న 10వ తరగతి విద్యార్థులు... బీహార్ లో దారుణం!

| అయితే.. అందుకు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా తాజాగా బీహార్ లో పదోతరగతి విద్యార్థులు తుపాకులతో కాల్చుకున్న ఘటన తెరపైకి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2025-02-21 11:22 GMT

సాధారణంగా అమెరికాలో రోజు రోజుకీ గన్ కల్చర్ పెరిగిపోతుందనే కథనాలు కనిపిస్తుంటాయనే సంగతి తెలిసిందే. అక్కడ రెగ్యులర్ గా ఏదో ఒక మూల తూపాకీ చప్పుళ్లు వినిపిస్తుండటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తుంటాయి. అయితే.. అందుకు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా తాజాగా బీహార్ లో పదోతరగతి విద్యార్థులు తుపాకులతో కాల్చుకున్న ఘటన తెరపైకి వచ్చింది.

అవును... పదో తరగతి పరీక్షల్లో మోసం చేశారనే ఆరోపణలు విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీశాయి. దీంతో.. రెచ్చిపోయిన విద్యార్థులు ఏకంగా తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు కాగా.. అందులో ఒక విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... బీహార్ లోని రొహ్తాస్ జిల్లాలో సాసారామ్ పట్టణంలో నిర్వహించిన మెట్రిక్యులేషన్ పరీక్షల్లో చీటింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో బుధవారం (ఫిబ్రవరి 19) విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మరుసటి రోజు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థుల మధ్య వ్యవహారం మరింత ముదిరి, భౌతిక దాడులకు దారి తీసింది.

అనంతరం తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు విద్యార్థులు. ఇందులో ఓ పదోతరగతి విద్యార్థి మృతి చెందగా.. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓ విద్యార్థికి కాలిలో గాయం కాగా.. మరో విద్యార్థి వీపుకు గాయమైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వీరిద్ధరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు.

స్థానిక పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా ఉండటంతో.. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.

మరోపక్క.. హత్యకు గురైన బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు నిరసనకు దిగారు. ఇందులో భాగంగా... న్యాయం జరిగే వరకూ స్థానిక రహదారిని దిగ్భందిస్తామని బైఠాయించారు. ఈ సమయంలో.. నిరసనకారులతో పోలీసు అధికారులు మాట్లాడి, శాంతించేలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

VIDEO | Bihar: A clash broke out between two groups of matriculation students over cheating in the exam hall in Sasaram, Rohtas district in which one student was shot dead and two were injured.#BiharNews #SasaramViolence(Full video available on PTI Videos -… pic.twitter.com/g87moSpQrg

— Press Trust of India (@PTI_News) February 21, 2025
Tags:    
  • Bihar 
  • Students 
  • Shootingincident 
  • TenthGradestudents 
  • Cheatingallegations 
  • Rohatasdistrict 
  • Saasaram 
  • Gunviolence 
  • Schoolviolence 
  • Policeinvestigation 
  • Protests 
  • Familyprotests 
  • ExamRelatedviolence 
  • Studentconflict 

Similar News

డిసెంబరులో కీలక మార్పులు.. రాయలసీమ నుంచి కొత్త మంత్రులు

2026-11-02 13:55 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

'పదకొండు' ముహూర్తం బాగుంది.. వాళ్లు భుజాలు తడుముంటే నేనేం చేయాలి : విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-02 13:50 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

వరుస తుఫాన్లు.. చంద్రబాబుకు ఎన్నో విధాల మేలు

2026-11-02 12:30 GMT

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

Copyright @2026

Powered by Blink CMS