ఇరవై రోజుల్లోనే సర్కార్ కొలువు... గేమ్ చేంజర్ కానుందా ?
అంతే కాదు ప్రతీ పేద కుటుంబానికి నెలకు 200 యూనిట్లు ఉచిత విధుత్ ని ఇస్తామని ప్రకటించారు. దీని వల్ల రాష్ట్రంలోని కోట్లాదిమందికి లబ్ది చేకూరుతుంది.;
ఎన్నికల్లో ప్రజలు ఎక్కువగా తమకు లాభం కలిగించే వాటి గురించే ఆలోచిస్తారు. నయా ట్రెండ్ కూడా అదే నిజం అంటోంది. గతంలో చూస్తే అభివృద్ధి మీద లోతైన చర్చ సాగేది. ఇపుడు మాత్రం ఎన్నికల హామీలు తాయిలాల మీదనే ఆధారపడి ఓటర్ల మూడ్ మారుతోంది. అలాగే ఫలితాలు అటు నుంచి ఇటు స్వింగ్ అవుతోంది. ఇక బీహార్ ఎన్నికల్లో చూస్తే హామీల విషయంలో చేతికి ఎముక లేనట్లుగా మహా ఘట్ బంధన్ వ్యవహరిస్తోంది. వివిధ వర్గాల ప్రజలను విపతీరంగా ప్రభావితం చేసే విధంగా హామీలను గుప్పిస్తోంది.
ఎన్నికల మ్యానిఫెస్టోలో :
ఇక తాజాగా మహా ఘట్ బంధన్ సీఎం అభ్యర్ధి ఆర్జేడీ అగ్ర నేత తేజస్వి యాదవ్ ఇతర మిత్రులతో కలిసి ఎన్నికల మ్యానిఫేస్టోని రిలీజ్ చేశారు. ఇందులో అన్ని వర్గాలను పూర్తి స్థాయిలో టచ్ చేశారు. ఎవరినీ ఎక్కడా ఉపేక్షించకుండా సమ న్యాయం పాటించారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని భారీ ఎన్నికల హామీని ఇచ్చారు. అది కూడా మహా ఘట్ బంధన్ అధికారంలోకి వచ్చిన ఇరవై రోజుల వ్యవధిలోనే ఒక చట్టాన్ని చేసి చూపిస్తామని చెబుతున్నారు.
మహిళలకు భారీ పధకం :
మహా ఘట్ బంధన్ ఇలా అధికారం దక్కించుకోగానే డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచే మరో భారీ పధకాన్ని మహిళల కోసం అమలు చేయబోతున్నారు. మై ఎహిన్ మాన్ యోజన పేరుతో ఈ పధకం అమలు కాబోతోంది. అర్హత కలిగిన ప్రతీ మహిళకూ నెలకు 2,500 రూపాయలు వారి ఖాతాలలో జమ చేస్తారు. ఆ విధంగా ఏడాదికి ముప్పై వేల రూపాయలు ఇస్తారు, అయిదేళ్లకు లక్షా యాభై వేల రూపాయలు ఈ విధంగా ఇస్తారు అన్న మాట. అంతే కాదు తల్లుల కోసం మాయీ, బిడ్డల కోసం భేటీ పధకం అమలు చేస్తారు.
ఓల్డ్ పెన్షన్ స్కీం :
ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ రాష్ట్రంలో ఎన్నికల వేళ కోరుకుంటున్న హామీ ఇది. పాత పెన్షన్ విధానం అమలు చేయాని వారు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఆ డిమాండ్ ని తాము అమలు చేస్తామని మహా ఘట్ బంధన్ ముందుకు వచ్చింది. ఇది బీహార్ లో ఒక తారక మంత్రంగా పనిచేస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే ఎన్నికలుఇ అంటే ఎపుడూ ఉద్యోగులే ప్రధాన పాత్ర పోషిస్తూంటారు. అదే విధంగా కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని మరో హామీని కూడా మహా ఘట్ బంధన్ ఇచ్చింది.
ఉచిత విద్యుత్ పధకం :
అంతే కాదు ప్రతీ పేద కుటుంబానికి నెలకు 200 యూనిట్లు ఉచిత విధుత్ ని ఇస్తామని ప్రకటించారు. దీని వల్ల రాష్ట్రంలోని కోట్లాదిమందికి లబ్ది చేకూరుతుంది. ఇక వికలాంగులకు నెలకు మూడు వేల రూపాయలు, వృద్ధులు, వింతతువులకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అలాగే రైతులకు కనీస మద్దతు ధర ఇస్తామ్నై ప్రతీ సబ్ డివిజన్ లో మహిళా కళాశాలలు ఏర్పాటు చేస్తామని ప్రతీ కొత్తగా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామని కీలక హామీలే ఇచ్చారు. ప్రతీ వ్యక్తికి ఇరవై అయిదు లక్షల రూపాయల వరకూ ఉచిత ఆరోగ్య భీమా సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే ఎవరూ ఇవ్వలేరు అన్నంతగా హామీల మూట దించేశారు మహా ఘట్ బంధన్ నేతలు. మరి ప్రజలలో అన్ని వర్ఘాలను కవర్ చేశామని అనుకుంటున్నారు. ఈ హామీలే రానున్న ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారి అధికారాన్ని దక్కిస్తాయని ఆశాభావంతో ఉన్నారు.