31 ఏళ్లకే 1000+ మంది మహిళలతో శృంగారం... ఎవరీ జేమ్స్!

యూకేలోని సౌత్ లండన్‌ కు చెందిన 31 ఏళ్ల బెన్నీ జేమ్స్.. సుమారు గత 10 సంవత్సరాలుగా ప్రతి వారం వేరే వేరే స్త్రీలతో ఉంటున్నాడట.;

Update: 2025-07-23 16:39 GMT

చాలామంది మగవాళ్లు తనని చూసి అసూయపడే స్థాయిలో అన్నట్లుగా మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు! తాను చేసిన పనికి చింతిస్తున్నాడు. పైగా ఇప్పుడు ఇతరులకు ఈ వ్యవహారంపై పలు సూచనలు చేస్తున్నాడు. ఇంతకూ ఎవరా వ్యక్తి.. ఏమిటీ 1000 మందికి పైగా మహిళల వ్యవహారం అనేది ఇప్పుడు చూద్దామ్...!

అవును... 1,000 మందికి పైగా మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకున్నానని చెబుతున్నాడు లండన్ కు చెందిన బెన్నీ జేమ్స్ అనే 31 ఏళ్ల వ్యక్తి. అయితే, తాను చేసిన దానికి ఇప్పుడు చింతిస్తున్నానని చెబుతూ... ఇతరులు ఎవరూ ఈ తప్పు చేయవద్దని హెచ్చరిస్తున్నానని చెబుతున్నాడు. దీంతో ఇతడి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యూకేలోని సౌత్ లండన్‌ కు చెందిన 31 ఏళ్ల బెన్నీ జేమ్స్.. సుమారు గత 10 సంవత్సరాలుగా ప్రతి వారం వేరే వేరే స్త్రీలతో ఉంటున్నాడట. ఈ విషయాన్ని అతను బహిరంగంగా అంగీకరించాడు. మొదట్లో అది ఎంతో ఉత్సాహంగా అనిపించిందని కూడా చెప్పాడు. అయితే కాలం గడిచేకొద్దీ.. అది తనకు ఒక రకమైన ద్వేషాన్ని కలిగించిందని ఇప్పుడు చెబుతున్నాడు.

ప్రస్తుతం తనకు ఒంటరితనం, విచారం మాత్రమే మిగిలిందని అంటున్నాడు. ఈ సందర్భంగా ఇతరులకు సూచనలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా... ఇలాంటి పనులు చేయడం వల్ల మీరు మంచి స్థానానికి వెళ్లరని.. ఈ అలవాటు మిమ్మల్ని క్రిందికి లాగేస్తుందని.. ఆ తర్వాత, మీరు సాధారణ, సంతోషకరమైన జీవితాన్ని గడపలేరని చెబుతున్నాడు.

ఇదే సమయంలో... ఒకసారి ఆ జీవితంలోకి వెళ్లిన తర్వాత తిరిగి సాధారణ జీవితాన్ని గడపడం కష్టమవుతుందని.. ఫలితంగా ఫైనల్ గా మీరు ఒంటరిగా మిగిలిపోయి, నిరాశకు గురవుతారని చెప్పుకొస్తున్నాడు. అందుకే అంటారేమో... ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని!

కాగా... కొన్ని నెలల క్రితం ఒకే రోజులో 1,000 మందికి పైగా పురుషులతో సెక్స్ చేయడం ద్వారా బ్రిటిష్ పోర్న్ స్టార్ బోనీ బ్లూ ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... బోనీ బ్లూ గురించి ప్రస్తావించాడు బెన్నీ జేమ్స్! ఈ సందర్భంగా... వెయ్యి మంది పురుషులతో సెక్స్ చేయడం చెడ్డ నిర్ణయం అని, భవిష్యత్తులో ఆమె పశ్చాత్తాపపడే అవకాశం ఉందని అన్నాడు!

Tags:    

Similar News