యూపీఐ ఎఫెక్ట్... కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షలకు జీఎస్టీ నోటీసు!

ఒక చిన్న దుకాణంలో కూరగాయలు అమ్మే శంకర్ గౌడ గత నాలుగేళ్లలో రూ.1.63 కోట్ల విలువైన కూరగాయలు అమ్మినట్లు లెక్కలు ఉన్నాయి.;

Update: 2025-07-22 17:19 GMT

భారతదేశంలో జీఎస్టీ విధానం కఠినంగా అమలవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తెగ చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారులు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. అలాకానిపక్షంలో భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ కూరగాయల వ్యాపారికి అందిన జీఎస్టీ నోటీసు వ్యవహారం ఆసక్తిగా మారింది.

అవును... తాజాగా బెంగళూరులోని ఒక కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షలకు జీఎస్టీ నోటీసు అందింది. బెంగళూరులోని మున్సిపల్ హైస్కూల్ సమీపంలో ఉండే శంకర్ గౌడ.. కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో గత నాలుగు సంవత్సరాలుగా అతని బ్యాంక్ అకౌంట్ ద్వారా నమోదైన లావాదేవీల కారణంగా.. అతనికి రూ.29 లక్షలకు జీఎస్టీ నోటీసు వచ్చింది!

అలా అని ఆ నోటీసు పొరపాటునో, తప్పుగానో వచ్చింది కాదు సుమా..! ఒక చిన్న దుకాణంలో కూరగాయలు అమ్మే శంకర్ గౌడ గత నాలుగేళ్లలో రూ.1.63 కోట్ల విలువైన కూరగాయలు అమ్మినట్లు లెక్కలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనికి జీఎస్టీ నోటీసు వచ్చింది. అయితే.. అతడు జీఎస్టీ చెల్లింపుదారుడు కాదని అంటున్నారు!

ఈ నేపథ్యంలో నోటీసు అందుకున్న వెంటనే అవాక్కవ్వడం శంకర్ గౌడ వంతయ్యిందంట. అనంతరం తేరుకుని... అధికారులను సంప్రదించి, తన వల్ల ఇంత జరిమానా కట్టడం సాధ్యం కాదని వేడుకున్నాడట! మరోవైపు ఈ నోటీసు అందుకున్నప్పటి నుంచీ... తన దుకాణంలో యూపీఐ పేమెంట్స్ ను అంగీకరించడం మానేశాడని అంటున్నారు!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... శంకర్ గౌడ నాలుగేళ్లలో రూ.1.63 కోట్ల విలువైన కూరగాయల వ్యాపారం చేయడం అంత ఆశ్చర్యకరమైన విషయం కాదనేది చాలా మంది అభిప్రాయంగా ఉంది. అందులో అతనికి వచ్చిన లాభాలను పరిగణలోకి తీసుకోవాలనేది ఇక్కడ చాలా మంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.. ఆ లెక్కలేమిటో ఇప్పుడు చూద్దామ్...!

నాలుగేళ్లలో రూ.1.63 కోట్లు... అంటే... 48 నెలల్లో అన్నమాట. అంటే... సుమారు 1,440 రోజుల్లో అన్నమాట. ఈ లెక్కన చూసుకుంటే... రూ.1,63,00,000 / 1,400 = రూ.11,319! అంటే... రోజుకి సరాసరిన పదకొండు వేల రూపాయల వ్యాపారం అన్నమాట. అందులో అందులో పెట్టుబడి ఎంత ఉంటుంది.. వచ్చే లాభం ఎంత ఉంటుంది? అనేది పాయింట్ కదా అని అంటున్నారు!

Tags:    

Similar News