వెబ్ సిరీస్ చూస్తూ బెంగళూరులో ఉరేసుకున్న 14 ఏళ్ల బాలుడు.. ఆ వెబ్ సిరీస్ ఇదే!

అసలు విషయంలోకి వెళ్తే.. బెంగళూరులో ఒక వెబ్ సిరీస్ ని చూస్తూ 14 ఏళ్ల బాలుడు ఉరి వేసుకోవడం సంచలనంగా మారింది.;

Update: 2025-08-09 06:40 GMT

సినిమాల ప్రభావం అటు యువత పైన ఇటు పిల్లల పైన ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా సినిమాలు సమాజానికి ఉపయోగపడే మంచి సందేశాన్ని ఇవ్వాలి అని ఇప్పటికే ఎంతోమంది నిపుణులు తెలియజేశారు. కానీ వినోదం కోసం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలు, వెబ్ సిరీస్ ల కారణంగా యువతలో చాలా మార్పులు వస్తున్నాయి. అయితే ఆ మార్పు ఇప్పుడు ఏకంగా ప్రాణాలు బలి తీయడానికి కూడా వెనకాడడం లేదు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. బెంగళూరులో ఒక వెబ్ సిరీస్ ని చూస్తూ 14 ఏళ్ల బాలుడు ఉరి వేసుకోవడం సంచలనంగా మారింది. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటి? అందులో ఏముంది? ఆ బాలుడు ఉరి వేసుకోవడానికి ప్రేరేపించిన అంశాలు ఆ వెబ్ సిరీస్ లో ఏమున్నాయి? అసలేం జరిగింది? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మూడు రోజుల క్రితం బెంగళూరులోని చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో 14 సంవత్సరాల బాలుడు గంధర్ 'డెత్ నోట్' రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంతో అటు కుటుంబ సభ్యులే కాదు ఇటు యావత్ సినీ ప్రేమికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవు అని , తండ్రి , తల్లి, అన్నయ్యతో చాలా సంతోషంగా ఉన్న ఆ బాలుడు అకస్మాత్తుగా ఉరివేసుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపోతే ఆ బాలుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం డెత్ నోట్లో పేర్కొనలేదు.

ఇక రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి విచారణ జరపగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ డెత్ నోట్ లో "నేను స్వర్గానికి వెళ్తున్నాను.. నాకోసం ఎవరూ ఏడవకండి. గుడ్ బాయ్ అమ్మ" అంటూ చాలా చక్కగా రాసి 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. అందరితో కలిసి రాత్రి భోజనం చేసిన గంధర్ తన పెంపుడు కుక్క రాఖితో కలిసి గదిలోకి వెళ్లిపోయాడట. ఆ తర్వాత అన్నయ్య గిటార్ ను మంచం మీద ఉంచి.. దానిపై కప్పుకొని తానే పడుకున్నట్లు అనిపించేలా చేశాడు. ఆగస్టు 4న ఉదయం 6 గంటలకు వాళ్ళ అన్నయ్య వచ్చి చూస్తే మంచం మీద గిటార్ ఉంది. కానీ గిటారు వేలాడదీసే చోట గంధర్ ఉండడం చూసి ఆశ్చర్యపోయారట. ముఖ్యంగా తల్లి సవిత జానపద గాయని, కళాకారిణి కూడా.. తండ్రి సంగీత కళాకారుడు.. శుక్రవారం ఒక కార్యక్రమం నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లారు. తల్లి దూరంగా ఉన్నప్పుడే గంధర్ ఇలా ఆత్మహత్య చేసుకున్నారు.

అంతేకాదు అతడు రాసిన డెత్ నోట్ లో ఉన్న అంశాలు చూసి అందరూ నోరెళ్ళ పెడుతున్నారు. "అందులో ప్రియమైన కుటుంబ సభ్యులారా.. ఈ లేఖ చదువుతున్నప్పుడు ఎవరు కూడా ఏడవద్దు. అప్పటికే నేను స్వర్గంలో ఉంటాను. దయచేసి నన్ను మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు. బాధగా ఉంటుంది. ఈ ఇల్లు బాగుండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను మీకు బాధ కలిగించాను. కానీ మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నా మీద కోపం ఉంటే క్షమించండి. 14 సంవత్సరాలు బ్రతకడం సంతృప్తిగా ఉంది. నేను సంతోషకరమైన క్షణాలను గడిపాను. స్వర్గంలో సంతోషంగా ఉన్నాను. నా స్కూల్ స్నేహితులకు కూడా ఈ విషయం చెప్పండి " అంటూ డెత్ నోట్ లో రాశాడు.

అయితే 14 ఏళ్లకే ఇంత స్పష్టంగా డెత్ నోట్ రాయడం అందర్నీ సందేహానికి గురిచేసింది. దీంతో వారు గందర్ ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీ, అతడు చూస్తున్న వెబ్ సిరీస్ మొదలైన వాటి వివరాలు తీసుకోగా.. అందులో ఆశ్చర్యపరిచే మరో విషయం బయటపడింది. డెత్ నోట్ అనే ఒక జపనీస్ సీరీస్ అన్ని ఎపిసోడ్లను క్రమం తప్పకుండా చూసేవాడట. అంతేకాదు ఆ వెబ్ సిరీస్ లోని ఒక పాత్ర చిత్రాన్ని కూడా గంధర్ తన గదిలో గీసినట్లు అక్కడ తెలుస్తోంది. పైగా అన్ని సీరియస్లకు సంబంధించిన పోస్టర్లను కూడా తన గది గోడలపై అంటించాడు. ఇక ఈ సిరీస్ ను నాన్ స్టాప్ గా చూస్తున్న గంధర్.. ఈ డెత్ నోట్ రాయడానికి ప్రేరణగా మారిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగా కథ ఆధారంగా 37 ఎపిసోడ్లతో జపనీస్ సీరీస్ ని 2006 నుండి 2007 వరకు ప్రసారం చేశారు. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ చూసిన చిన్నపిల్లల్లో డిప్రెషన్, అనవసరమైన సాహసాలు, ఆత్మహత్య ఆలోచనలు వంటివి ప్రపంచవ్యాప్తంగా కనిపించాయి. ఇప్పుడు గంధర్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా ఈ డెత్ నోటు వెబ్ సిరీస్ ఏమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News