బండికి టికెట్ డౌట్ లో పడిందా...?

తెలంగాణా బీజేపీ మాజీ ప్రెసిడెంట్ బండి సంజయ్ కి టికెట్ డౌట్ లో పడిందా అన్న చర్చ సాగుతోంది. బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఎంపీగా 2019లో గెలిచారు.;

Update: 2023-10-20 15:20 GMT

తెలంగాణా బీజేపీ మాజీ ప్రెసిడెంట్ బండి సంజయ్ కి టికెట్ డౌట్ లో పడిందా అన్న చర్చ సాగుతోంది. బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఎంపీగా 2019లో గెలిచారు. అంతకు ముందు 2018లో ఆయన బీజేపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని ఆయన పట్టుబట్టి ఉన్నారు.

అయితే బండి సంజయ్ కి తెలంగాణా అసెంబ్లీకి పోటీ చేసేందుకు బీజేపీ హై కమాండ్ అనుమతించడం లేదా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే బండి సంజయ్ ని తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించిన కమలం పార్టీ ఆయనను జాతీయ కార్యవర్గంలో నియమించింది.

ఇపుడు అదే జాతీయ కార్యవర్గాన్ని దేశంలో జరుగుతున్న ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి పంపుతోంది. అలా కనుక చూస్తే బండి సంజయ్ ని చత్తిస్ ఘడ్ ఎన్నికలకు ప్రచారానికి పంపబోతోంది అని అంటున్నారు. దాంతో బండి సంజయ్ ఇక మీదట బీజేపీకి ప్రచారం చేయాల్సింది చత్తీస్ ఘడ్ లోనే.

అంటే ఆయన తెలంగాణాలో ఉండేందుకే సమయం చాలదు అని అంటున్నారు. ఇక బండి సంజయ్ తాను పోటీ చేయాలని చూస్తున్న కరీంనగర్ లోనూ సొంతంగా ప్రచారం చేసుకోలేరు అని అంటున్నారు. ఇక చూస్తే బండి సంజయ్ తనకు టికెట్ దక్కుతుంది అన్న ఆశతో ఇప్పటికే ప్రచారాన్ని కరీంనగర్ లో మొదలెట్టేశారు అని అంటున్నారు.

అయితే బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బండి సంజయ్ అనుచరులు తమ నేతకు టికెట్ ఇస్తున్నారా లేదా అన్న డౌట్ లో పడిపోయారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే బండి సంజయ్ ని కొద్ది నెలల క్రితం తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించడం వెనక కూడా ఒక వ్యూహం ఉంది అని అంటున్నారు.

తెలంగాణా ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ని బీసీల నుంచి సీఎం గా ప్రొజెక్ట్ చేయబోతున్నారు అని టాక్ నడుస్తోంది. బండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మళ్లీ అది వేరే సంకేతాలు పంపిస్తుంది అని కూడా ఆలోచిస్తున్నారు అంటున్నారు.

ఇదిలా ఉంటే బండి సంజయ్ కి తప్పనిసరిగా టికెట్ వస్తుంది అని అంటున్న వారూ ఉన్నారు. చత్తీస్ ఘడ్ ఎన్నికలు నవంబర్ 7లో తొలి విడత, నవంబర్ 17న రెండవ విడతలో జరుగుతాయి. తెలంగాణాలో నవంబర్ 30న జరుగుతాయి. అందువల్ల ముందుగా ఎన్నికలు ఉన్న చోట బండి సంజయ్ ప్రచారం నిర్వహించినా తాను పోటీలో ఉన్న చోటతో పాటు తెలంగాణాలో కూడా పార్టీకి ప్రచారం చేస్తారని అంటున్నారు.

ఏది ఏమైనా బండి సంజయ్ కి టికెట్ వస్తుందా రాదా అన్నది చర్చగా ఉంది. ఇక బండి సంజయ్ కి ప్రెసిడెంట్ పదవిని తప్పించడం మీద ఆయన అనుచరులు మండుతున్నారని టాక్. ఇపుడు టికెట్ ఇవ్వకపోతే ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది అంటున్నారు.

Tags:    

Similar News