బండి సంజయ్ బంపర్ అఫర్ !

ప్రతి ఎన్నికలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమీషన్ పనిచేస్తున్నది.

Update: 2024-04-23 11:30 GMT

‘‘కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ కేంద్రాలలో 80 నుండి 100 శాతం ఓటింగ్ నమోదయ్యేలా కృషి చేసిన వారికి రూ.10 వేల ప్రోత్సాహక నగదు అందజేస్తాం. ఎన్నికల సంఘం ఓటింగ్ పెంచేందుకు చేస్తున్న కృషిలో స్వచ్చంద సంస్థలు, పార్టీలు భాగస్వాములు కావాలి’’ అని కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పిలుపునిచ్చాడు. బండి చేసిన ఈ ప్రకటన పలు ప్రశ్నలకు తెరలేపుతున్నది.

ప్రతి ఎన్నికలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమీషన్ పనిచేస్తున్నది. ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నగదు బహుమతి అఫర్ కరీంనగర్ వరకే పరిమితమా ? ఆ నగదు ఎన్నికల కమీషన్ ఇస్తుందా ? బండి సంజయ్ సొంత డబ్బులు ఇస్తాడా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

మరి ఓటింగ్ శాతం పెంచేందుకు బంపర్ అఫర్ ప్రకటించిన బండి సంజయ్ దేశంలోని మిగతా రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో కొన్ని చోట్ల పోలింగ్ సమయం సాయంత్రం నాలుగు గంటల వరకు, మిగతా అన్ని చోట్లా సాయంత్రం 5 గంటల వరకే అని ఎన్నికల కమీషన్ వెల్లడించింది. అసలే వేసవికాలం. సాయంత్రం 5 గంటల వరకు 39 డిగ్రీల వరకు ఊష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 తర్వాత కూడా ఓటర్లకు ఓటు వేసుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుంది.

మరి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమీషన్ కు బండి లేఖ ఎందుకు రాయడం లేదు ? మీడియా ముఖంగా అయినా ఎందుకు ప్రశ్నించడం లేదు ? పక్కన ఉన్న ఆంధ్రా, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలతో పాటు దేశమంతా సాయంత్రం 6, 7 గంటల వరకు పోలింగ్ కు అనుమతినిచ్చిన ఈసీ ఒక్క తెలంగాణలో మాత్రమే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ పరిమితం చేయడం వెనక అనుమానాలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News