పాక్ దిమ్మదిరిగింది..సొంత జెండా ఎత్తిన బలూచిస్తాన్
సరైన టైమ్ టైమింగూ లేకుండా పెద్ద దేశం అయిన భారత్ తో పెట్టుకుంటే కధ ముగిసిపోతుంది అన్నది పాకిస్థాన్ కి తెలిసి వచ్చేలోగా పుణ్యకాలం ముగుస్తోంది.;
సరైన టైమ్ టైమింగూ లేకుండా పెద్ద దేశం అయిన భారత్ తో పెట్టుకుంటే కధ ముగిసిపోతుంది అన్నది పాకిస్థాన్ కి తెలిసి వచ్చేలోగా పుణ్యకాలం ముగుస్తోంది. పాకిస్థాన్ అంతర్గత సమస్యలతో సతమతం అవుతోంది. బలూచిస్తాన్ సొంత జెండా ఎత్తింది.
తమకు సొంతంగా ఉండాలని స్వతంత్ర్యంగా తాను వ్యవహరించాలని చాలా కాలంగా కోరుతూ వస్తున్న బలూచిస్తానీయులు ఇపుడు సరైన సమయం చూసి మరీ పాక్ కి భారీ షాక్ ఇస్తున్నారు. భారత్ వంటి బడా దేశం ఒక వైపు ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ని చితక్కొడుతూంటే ఇదే సందు అనుకుని బలూచిస్తాన్ తన సత్తా చూపిస్తోంది.
దశాబ్దాల తన కలను నెరవేర్చుకుంటోంది. బలూచిస్తాన్ లో తాజా సన్నివేశం ఏమిటి అంటే పాకిస్థాన్ జెండాలు ఎక్కడా కనిపించడం లేదు. అదే ప్లేస్ లో బలూచిస్తాన్ జెండాలను పెట్టి మరీ వారు తమ సొంత ప్రతిపత్తిని చాటుకుంటున్నారు.
ఒక వైపు భారత్ చేతిలో చావుదెబ్బ తింటున్న పాకిస్థాన్ కి ఇది చాలదు అన్నట్లుగా బలూచిస్తాన్ నుంచి భారీ ఎటాక్ ఎదురవుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు ముమ్మరం చేయడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అంతే కాదు తమ దేశానికి దౌత్య కార్యాలయాలు మార్చాలని ప్రపంచ దేశాలకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ విజ్ఞప్తి చేయడం కూడా సంచలనంగా మారుతోంది. ఇక చరిత్ర చూస్తే పాకిస్థాన్ నుంచి వేరు పడిపోవాలని తమకు ప్రత్యేకంగా ఒక దేశం కావలాని బలూచ్ లిబరేషన్ ఆర్మీ 1971 నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూ వస్తోంది.
ఈ రోజుకు అది పక్వానికి వచ్చింది. ఎంతలా అంటే అక్కడ పాకిస్థాన్ ఆధిపత్యం చెల్లడం లేదు. భారీ సైనికుల పహారాతో తప్ప పాక్ పాలకులు ఆ గడ్డ మీద అడుగు పెట్టలేరు. ఇక ఎవరైనా అక్కడికి పాక్ అధిపత్యం చూపాలని వెళ్తే తిరిగి రాని పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఒక్క ముక్కల్లో చెప్పాలీ అంటే బలూచిస్తాన్ పాక్ నుంచి ఏనాడో చేజారింది.
ఇపుడు భారత్ పాక్ మీద తడాఖా చూపిస్తూండడంతో వేయి ఏనుగుల బలం వచ్చిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమకంటూ కొత్త దేశాన్ని ప్రకటించుకోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తునారు. పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ జెండాలు దించివేత, బలూచ్ జెండాల ఆవిష్కరణలల్తో బలూచ్ లిబరేషన్ ఆర్మీ దూకుడు చేస్తోంది.
ఇక చూస్తే కనుక బలూచిస్తాన్ లో ఎటు చూసినా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి అంతే కాదు బలూచిస్థాన్ స్వాతంత్రానికి అనుకూలంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలు సైతం కనిపిస్తున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక తాజా పరిణామాలు చూస్తే కనుక ప్రపంచ దేశాలు పాకిస్థాన్ నుంచి తమ దౌత్య కార్యాలయాలను ఉపసంహరించుకుని కొత్తగా ఆవిర్భవిస్తున్న బలూచిస్థాన్ దేశానికి మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. అని కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ట్వీట్ చేయడం సనలనం రేపుతోంది. తాము ప్రపంచ దేశాలకు తమది కొత్త దేశంగా ఉందని దానిని గుర్తినాలని పిలుపునిస్తున్నట్లుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ వెల్లడిస్తోంది
ఇక పాకిస్థాన్ సైనికులే లక్ష్యంగా చేసుకుని బలూచ్ లిబరేషన్ ఆర్మీ వారి తొక్క తీసి తోలు కడుతోంది. దొరికిన వారిని దొరికినట్లుగా హతమారుస్తోంది. భారత్ పాక్ మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేయడంతో బలూచిస్తాన్ లో సాధారణ పౌరులకు కూడా ఎక్కడ లేని ధైర్యం వచ్చినట్లుగా ఉంది. వారు సైతం వీధులలోకి వచ్చి పాక్ జెండాలని చించేసి తగలబెడుతున్నారు. ఇవన్నీ చూస్తూంటే నేడో రేపో బలూచిస్తాన్ సొంత దేశంగా ప్రకటించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగానే అంతా భావిస్తున్నారు అదే జరిగితే పాక్ ముక్కచెక్కలు అయినట్లే అని అంటున్నారు.