• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్రేకింగ్: పాక్ కు షాక్...

బ్రేకింగ్: పాక్ కు షాక్ .. బలూచిస్తాన్ ఇక స్వతంత్ర రాజ్యం!

| ఊహించిన పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఎప్పటినుంచో భయపడినది నిజమైంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది.

By - Tupaki Desk
Update: 2025-05-14 08:35 GMT

ఊహించిన పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఎప్పటినుంచో భయపడినది నిజమైంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. బలూచిస్తాన్ సైన్యం ఈ మేరకు ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.

దశాబ్దాలుగా బలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా చూడాలని అక్కడి తిరుగుబాటు దళాలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు గడిపేలా చేశాయి. తమ పోరాటంతో పాకిస్తాన్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేశాయి. బలూచిస్తాన్ దళాల నుంచి తమను కాపాడుకోవడానికి పాకిస్తాన్ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ దళాలు మాత్రం వెనకడుగు వేయలేదు. సరిహద్దుల్లో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలించాయి. అత్యాధునిక ఆయుధాలతో దాడులు చేస్తూ పాకిస్తాన్ సైన్యానికి నరకం చూపించాయి.

ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలను అవకాశంగా తీసుకున్న బలూచిస్తాన్ తిరుగుబాటు దళాలు, పాకిస్తాన్ సైన్యంపై మరింతగా విరుచుకుపడ్డాయి. వందలాది మంది పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టి తమ సత్తా చాటాయి. ఇతర దేశాల మద్దతుతో పాకిస్తాన్‌కు కష్టాలు తెచ్చిపెట్టాయి. దీంతో పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోక తప్పలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించడంతో బలూచిస్తాన్ దళాలు సంబరాలు చేసుకుంటున్నాయి.

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన:

"ఇది ఎన్నో సంవత్సరాల పోరాటం. లెక్కలేనన్ని త్యాగాల ఫలితంగా వచ్చిన గుర్తింపు ఇది. మేము సాధించిన స్వేచ్ఛ అమూల్యమైనది. ఈ స్వాతంత్య్రం మాటల్లో వర్ణించలేనిది. ఇది మా యోధుల త్యాగాల ఫలితం. నిస్సందేహంగా మేము మమ్మల్ని గొప్పగా పాలించుకుంటాం. అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటాం. ప్రపంచం మమ్మల్ని ఆశ్చర్యంగా చూసేలా అడుగులు వేస్తాం" అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.

పాకిస్తాన్ నుంచి విడిపోయి తాము స్వతంత్ర దేశంగా ఏర్పడ్డామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. అంతేకాకుండా, క్వెట్టా నగరంలో కొత్త పార్లమెంట్ భవనం యొక్క ఫోటోలను, జాతీయ చిహ్నాన్ని, జాతీయ గీతాన్ని సోషల్ మీడియాలో విడుదల చేసింది. భారత్తో సహా ఇతర దేశాలలో తమ రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం కోసం తాము ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని, ఆ పోరాటం ఇప్పుడు నిజమైన రూపం దాల్చిందని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. "ఇది మా పోరాటానికి దక్కిన విజయం. మా త్యాగాలకు లభించిన గౌరవం. ఇదంతా ఇప్పుడు నిజంగా జరుగుతోంది. ఇంతకంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదు" అని బలూచిస్తాన్ ఆర్మీ భావిస్తోంది.

Tags:    
  • Balochistan 
  • Independence 
  • PakistanCrisis 
  • BLA 
  • SouthAsia 
  • BalochistanFreedom 
  • DemocraticRepublic 
  • Geopolitics 
  • Sovereignty 
  • Pakistan 
  • BalochLiberation 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS