హిందువులకు మాత్రమే ఇక మీదట ఎంట్రీ!
దేశంలో ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. చారిత్రాత్మకమైన దేవాలయాలకు భారత దేశం పెట్టింది పేరు.;
దేశంలో ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. చారిత్రాత్మకమైన దేవాలయాలకు భారత దేశం పెట్టింది పేరు. వేలాది ఏళ్లుగా ఈ ఆలయాలు కొనసాగుతున్నాయి. ఇక భారత్ అంటే భిన్న సంస్కృతులు మతాలు వ్యవహారాలు ఆచారలతో నిండినది. దాంతో ఎక్కడికి ఎవరైనా వెళ్ళవచ్చు అన్నది ఉంది. ముఖ్యంగా హిందూ ఆలయాలలో అన్య మతస్థులకు ప్రవేశం ఉందా అంటే విశ్వాసం ఉందని డిక్లరేషన్ చేస్తే వెళ్లవచ్చు అన్నది ప్రధాన ఆలయాలలో నియమంగా ఉంది. చాలా చోట్ల అది కూడా అవసరం లేకుండా వెళ్ళవచ్చు. అయితే ఇపుడు కొత్తగా ఒక నిబంధనను తీసుకుని రాబోతున్నారు. అదేంటి అన్నది ఆసక్తికరంగా ఉంది.
బద్రీనాధ్ కేదార్ నాధ్ :
దేశంలో ఉత్తరాన ఉన్న అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటైన బద్రినాథ్ కేదార్ నాధ్ లలో దర్శనానికి వచ్చే భక్తుల విషయంలో కొత్త నిబంధన తీసుకుని రాబోతున్నారు. ఈ ఆలయాలలో ఇక మీదట ప్రవేశాలను కట్టుదిట్టం చేయబోతున్నారు. ఈ మేరకు కీలక ప్రతిపాదనలనే ఆలయ కమిటీని ముందుకు తీసుకుని వచ్చింది.
కేవలం హిందువులకే :
దేశంలో ఎంతో కీలకమైన బద్రీనాధ్ కేదార్ నాధ్ ఆలయాలలో ప్రవేశం ఇక మీద హిందువులకే ఉండబోతోంది. ఈ మేరకు ఆలయ కమిటీ త్వరలో సమావేశమై తీర్మానించనుంది. ఈ విషయాన్ని ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేదీ ధృవీకరించారు. కేవలం ఈ రెండు ఆలయాలు మాత్రమే కాదు ఈ ఆలయ కమిటీ పరిధిలోకి వచ్చే మరిన్ని ఆలయాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇప్పటికే అక్కడ అమలు :
ఇదిలా ఉంటే ఇప్పటికే గంగోత్రి ధాం లోకి హిందువులు కానీ వారిని ప్రవేశం నిషేధించారు. గంగోత్రి టెంపుల్ కమిటీ దీనిపైన ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. దాంతోనే బద్రీనాధ్ కేదారి నాధ్ ఆలయాలకు సంబంధించి ఆలయ ప్రవేశం పైన నిబంధలకు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఈ కొత్త నిబంధన అమలు ఎప్పటి నుంచి అన్నది మాత్రం ఆలయ కమిటీ ఇంకా తెలియచేయలేదు.
చార్ ధాం యాత్ర కోసం :
దేశంలో చార్ ధాం యాత్ర కోసం లక్షలాది మంది భక్తులు ప్రతీ ఏటా ఇక్కడికి వస్తూంటారు ఈ ఆలయాలలో ఆ సమయాలలో కిక్కిరిసి ఉంటుంది. ప్రతీ ఏటా శీతాకాలం ఆలయం తలుపులు మూసివేస్తారు, తిరిగి ఎండా కాలం ప్రవేసితూనే ఏప్రిల్ నెలలో తెరుతారు. అలా ఆరు నెలల పాటు ఆలయాలలో భక్తుల దర్శనాలు అనుమతిస్తారు. ఈ ఏడాది చూస్తే కనుక ఏప్రిల్ 23 నుంచి బద్రీనాధ్ కేదారి నాధ్ ఆలయాలు తెరచుకుంటాయని చెబుతున్నారు. అలాగే గంగోత్రి యమునోత్రి ఆలయాలు కూడా ఏప్రిల్ 19 నుంచి తెరుస్తారు. మొత్తం మీద చూస్తే కీలక మైన ఆలయాలకు ఈ కొత్త నిబంధన అమలు అయితే దేశంలోని ఇతర పుణ్య క్షేత్రాలు కూడా అనుసరిస్తాయా అన్న చర్చ అయితే సాగుతోంది.