ఆ ఒక్క పాయింట్ తో బాబు బెయిల్ రద్దు అవుతుందా...
స్కిల్ స్కాం గురించి కానీ ఆ కేసు గురించి కానీ ఎక్కడా బహిరంగంగా ప్రస్తావించ వద్దు అని సూచించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ఆయనకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక సుప్రీం కోర్టులో బాబు బెయిల్ పిటిషన్ మీద విచారణ కొనసాగుతోంది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చంద్రబాబుకు ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ స్కాం గురించి కానీ ఆ కేసు గురించి కానీ ఎక్కడా బహిరంగంగా ప్రస్తావించ వద్దు అని సూచించింది.
అదే విధంగా రాజకీయూ కార్యకలాపాలు అయితే సాఫీగా నిర్వహించుకోవచ్చు అని బాబుకు ఊరటను ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా బాబు ఎక్కడా స్కిల్ స్కాం విషయం ప్రస్తావించలేదు. కానీ తుఫాన్ బాధితుల పరామర్శకు శుక్రవారం వెళ్ళిన బాబు తెనాలి నియోజకవర్గం లో పర్యటిస్తూ స్కిల్ స్కాం మీద మాట్లాడేశారు.
తనను అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకుండా జగన్ జైలు పాలు చేసారు అంటూ బాబు హాట్ కామెంట్స్ చేశారు. తాను న్యాయపరంగా కానీ సాంకేతికంగా కానీ ఎలాంటి తప్పూ చేయలేదని అయినా సరే జైలులో పెట్టారని జగన్ మీద నిప్పులు చెరిగారు.
సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకుని వైసీపీ బాబు తప్పు చేశారు అని అంటోంది. బాబుకు బెయిల్ ఇచ్చిన తరువాత స్కిల్ స్కాం మీద ఏమీ మాట్లాడకూడదని ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేస్తోంది. స్కిల్ స్కాం కేసు విచారణలో ఉంది. అలాంటి దాని మీద ఏమీ తేలకుండా బాబు ఏమి మాట్లాడుతారు అని వైసీపీ నేతలు అంటున్నారు.
తాను ఏ తప్పూ చేయలేదని సచ్చీలుడిని అని ఆయన ఎలా చెప్పుకుంటారు అని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు రెండు తప్పులు చేసారని తనని అరెస్ట్ చేసినందుకు సీఐడీ మీద రిమాండ్ విధించిన కోర్టు మీద కూడా ఆయన అన్యాపదేశంగా కామెంట్స్ చేశారని అంటున్నారు.
కేసు గురించి ఎక్కడా ప్రస్తావించవద్దు అని సుప్రీం కోర్టు చెప్పినా కూడా బాబు పట్టించుకోకుండా ఈ కేసు విషయం మీడియా ముందు మాట్లాడారు అంటే ఆయనకు కోర్టులు అన్నా చట్టాలు అన్నా గౌరవం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఇక ఈ పాయింట్ మీదనే బాబు బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అని కూడా అంటున్నారు. న్యాయ నిపుణులు సైతం బాబు చేసింది అచ్చంగా కోర్టు ఉల్లంఘనే అని అంటున్నారు. మరో వైపు చూస్తే సుప్రీం కోర్టులో బాబు బెయిల్ ని రద్దు చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసిందని, దాని మీద కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు బాబు తరఫున న్యాయవాదులను కఒరినా ఇప్పటిదాకా వేయలేదని శుక్రవారం విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. ఏది ఏమైనా బాబు కేసు స్కిల్ స్కాం జైలు బెయిల్ ఇవన్నీ ఎన్నికలలో రాజకీయ ఆయుధాలుగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.