స్పీకర్‌గారి అబ్బాయ్: మాట కటువు.. మనసు మృదువు!
వందేమాతరం బిల్లుపై చర్చ వచ్చినప్పుడు.. వైసీపీ పాలనలో తెలుగును ఎలా ఖూనీ చేశారో.. చూడండి అంటూ ప్రత్యేకంగా చర్చ పెట్టారు. విజయ్ కీలక వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి వారసుడు, మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న యువ నాయ కుడు విజయ్.. ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత నెలలోనే ఆయన పెద్దల సభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నెల రోజుల కాలంలో ఆయన పదవి చేపట్టిన వెంటనే వర్షాకాల సమావే శాలు ప్రారంభం కావడంతో చిన్నవాడైనా.. గట్టి పనితీరుతో సభలో తనదైన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సమయం ఏది వచ్చినా.. సందర్భం ఏది వచ్చినా.. వైసీపీ అధినేత జగన్ సహా.. ఆయన పాలనపై విరుచుకుపడ్డారు.
వందేమాతరం బిల్లుపై చర్చ వచ్చినప్పుడు.. వైసీపీ పాలనలో తెలుగును ఎలా ఖూనీ చేశారో.. చూడండి అంటూ ప్రత్యేకంగా చర్చ పెట్టారు. విజయ్ కీలక వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆనాడు తెలుగు మీడియంను రద్దు చేసే ప్రయత్నం చేశారని అన్నారు. అదేసమయంలో తెలుగును కోరుకున్న వారిపై నానా దుర్భాషలాడారని కూడా వివరించారు. ఇక, కేరళ రాష్ట్రం పేరును `కేరళం` మార్చే అంశానికి సంబంధించిన బిల్లుపై మాట్లాడుతూ.. అమరా వతిని ప్రస్తావించారు. ``మాదగ్గర ఒకడున్నాడు..`` అంటూ జగన్ గురించి తీవ్ర విమర్శలు గుప్పించారు.
అమరావతిని మావిగన్‌గా మార్చే ఎత్తుగడ చేస్తున్నారని.. పార్లమెంటు, చట్టసభలు అంటే ఏమాత్రం ఆయనకు గౌరవం లేదని విరుచుకుపడ్డారు. అంతేకాదు.. అమరావతిని పార్లమెంటు ఉభయ సభలు గుర్తించిన తర్వాత కూడా మావిగన్ అంటూ అర్ధంలేని విమర్శలు చేస్తున్నాడని అన్నారు. ఇక, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లుపై చర్చ వచ్చినప్పుడు.. అనూహ్యంగా విజయ్.. జగన్ పాత కేసుల సంగతేంటని నిలదీశారు. న్యాయం అందరికీ సమానమైనప్పుడు.. 12 ఏళ్లుగా బెయిల్‌పై ఎలా ఉన్నాడని ప్రశ్నించారు.
ఇలా .. విజయ్ మాట కటువుగా అనిపించినా.. వాస్తవాలను వెలికితీసేసరికి.. వైసీపీ సభ్యులకు వాయిస్ లేకుండా పోయింది. ఇక, ఆయన మాట కటువుగా అనిపించినా.. మనసు మాత్రం మృదువని నిరూపించుకున్నారు విజయ్. తను రాజ్యసభ సభ్యుడిగా ఈ నెల 1న అందుకున్న 3 లక్షల రూపాయల వేతనాన్ని.. దేశం కోసం అమరులైన జవాన్ల నిధికి విరాళంగా ఇచ్చి.. దేశ భక్తిని చాటుకున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయిన విజయ్.. ఈ మేరకు చెక్కును అందించి.. సైనికుల కుటుంబాల సంక్షేమానికి వినియోగించాలని కోరారు.