వివేకా హత్య : ఎంపీ అవినాష్ పై ఈడీ గురి !

దీనిపై అనేక చార్జ్ షీట్లు దాఖలు చేసిన సీబీఐ 2023లో అవినాష్ రెడ్డిని అరెస్టు చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు.

Update: 2026-08-21 06:01 GMT

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నేపథ్యంలో తాజాగా ఈ రోజు కడప వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తుల మీద ఈడీ దాడులు చేయడం కలకలం రేపుతున్నది. 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి, వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి తన నివాసంలో హత్యకు గురయ్యాడు. మొదట ఈ కేసును దర్యాప్తు చేసిన రాష్ట్ర పోలీసులు 2020లో ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి అప్పగించారు.

సీబీఐ ఆరోపణల ప్రకారం వైసీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అతని సన్నిహితులు వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలు వివేకానందరెడ్డి వైసీపీలో చేరడంతో తమ రాజకీయ భవిష్యత్తుకు ముప్పు ఏర్పడుతుందని భయపడి హత్యకు కుట్ర పన్నినట్లు చెబుతుంది. ఇందులో వివేకానందరెడ్డి సిబ్బంది గంగిరెడ్డి. షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్ వంటి వారు భాగస్వాములు అని ఆరోపణలు వచ్చాయి.

దీనిపై అనేక చార్జ్ షీట్లు దాఖలు చేసిన సీబీఐ 2023లో అవినాష్ రెడ్డిని అరెస్టు చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. ఇదే కేసులో భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధించి రూ.4 కోట్లు సుపారీ ఇచ్చినట్లు, హవాలా ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

2025 ఆగస్టులో ఈడీ మనీలాండరింగ్ కింద ఆర్థిక లావాదేవీల మీద దర్యాప్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం నుండి అవినాష్ రెడ్డి నివాసాలు, ఆస్తుల మీద ఈడీ సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. హైదరాబాద్ లో 2 చోట్ల, పులివెందులలో 4 నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

హైదరాబాద్ కోకాపేటలోని అవినాష్ రెడ్డి విల్లా, కార్యాలయం, పులివెందుల నివాసం, కార్యాలయం, పులివెందుల భక్రాపురంలోని వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసం, ఇతర నిందితులు సునీల్ యాదవ్, షేక్ దస్తగిరి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పులివెందుల మరియు హైదరాబాద్ నార్సింగి మై హోమ్ అవతార్, తొండూరు మండలంలో ఎర్ర గంగిరెడ్డి నివాసంలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈడీ ఆస్తుల వివరాలు, డాక్యుమెంట్లు, నగదు లావాదేవీల ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News