గోల్కొండ టు చార్మినార్ .. నిజమా ? అబద్దమా ?

ఇవి అనధికారిక తవ్వకాలు అని ఆరోపించిన నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్, పోలీస్ కమీషనర్ లకు సమాచారం అందడంతో అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

Update: 2026-08-21 04:39 GMT

కులీ కుతుబ్ షా 1591లో హైదరాబాద్ నగరాన్ని, చార్మినార్ ను నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గోల్కొండ కోట నుండి కొత్త నగరానికి అత్యవసర సమయాల్లో రావడానికి రహస్యంగా గోల్కొండ నుండి చార్మినార్ వరకు సొరంగ మార్గం నిర్మించారని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 1927లో సయ్యద్ అలీ అస్గర్ బిల్గ్రామీ తన ‘ల్యాండ్ మార్క్స్ ఆప్ ది డెక్కన్’ లో గోల్కొండ నుండి బరాదరి మీదుగా గోషామహల్ కు ఐదు మైళ్ల దూరం సొరంగం ఉందని పేర్కొన్నాడు. దీంతో చార్మినార్ కు కూడా సొరంగ మార్గం ఉందని బలంగా నమ్ముతున్నారు.

తాజాగా నిన్న గొల్కొండలోని 18సీడీ ప్రాంతంలో 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ స్మశానవాటిక మరియు ఆటస్థలం వద్ద ఆర్మీ అధికారులు చేపట్టిన తవ్వకాలలో ఒక సొరంగం బయటపడినట్లు ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ట్వీట్ చేశాడు. ఇవి అనధికారిక తవ్వకాలు అని ఆరోపించిన నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్, పోలీస్ కమీషనర్ లకు సమాచారం అందడంతో అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు పెద్దఎత్తున సందర్శనకు వస్తున్నారు.

అయితే ఇది గోల్కొండ - చార్మినార్ రహస్య మార్గం అన్నది నిర్ధారణ కాలేదు. చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఇలాంటి మార్గం ఉందన్నది ఒక చారిత్రక నమ్మకం మాత్రమే. గోల్కొండ - చార్మినార్ మధ్య సుమారు 9 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో మూసీ ఉంటుంది. ఈ నేపథ్యంలో అంత పొడవైన సొరంగం నిర్మించడం సాంకేతికంగా ఎంతో కష్టం అని చెబుతున్నారు. గోల్కొండతో పాటు పాతబస్తీలో చిన్న చిన్న సొరంగాలు, అండర్ గ్రౌండ్ మార్గాలు ఉన్నాయని రికార్డులు సూచిస్తున్నాయి. కానీ ఈ మార్గం ఉన్నట్లు ఇప్పటి వరకు నిరూపించబడలేదు.

Tags:    

Similar News