ఇకపై 4 రోజులే వర్కింగ్ డేస్.. రిజల్ట్ చూస్తే షాక్!

ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన ఒక ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-05-25 12:30 GMT

ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన ఒక ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ కేవలం 4 రోజుల వర్క్ చేయటం. ఇక ఈ విధానాన్ని టెస్ట్ చేయగా, అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. కంపెనీల్లో ప్రొడక్టివిటీ పెరగడమే కాకుండా ఉద్యోగులు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి మన భారతదేశంలో కూడా ఇలాంటి రూల్ వస్తే బాగుంటుంది కదా అని నెటిజన్లు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చూద్దాం..

ఆస్ట్రేలియాలో సూపర్ హిట్ ప్రయోగం:

ఆస్ట్రేలియాలో కొన్ని కంపెనీలు కలిసి వారానికి 4 రోజులు మాత్రమే పని, 3 రోజులు సెలవు అనే పద్ధతిని ట్రయల్ రన్‌గా చేపట్టాయి. ఆశ్చర్యకరంగా ఈ ప్రయోగంలో పాల్గొన్న 15 కంపెనీలలో 14 కంపెనీలు దీనికి ఫిదా అయిపోయి, శాశ్వతంగా దీనినే అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇక తక్కువ రోజులు పనిచేసినా ఆఫీస్ అవుట్‌పుట్ భారీగా పెరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా:

ఆస్ట్రేలియాలో ఉద్యోగుల లైఫ్ స్టైల్, అక్కడి వర్క్ కల్చర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ మన ఇండిఈయాలో పరిస్థితి వేరు. ఇక్కడ జనాభా ఎక్కువ, నిరుద్యోగం కూడా ఎక్కువే. ఇక దాంతో దొరికిన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి మనవాళ్లు రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే, ఇక్కడ ఉద్యోగం అనేది కేవలం జీవనాధారం మాత్రమే కాదు, ఒక పెద్ద అవసరం.

పెరిగిపోతున్న ఒత్తిడి.. దెబ్బతింటున్న ఆరోగ్యం:

భారతదేశంలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారిపై వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటోంది. టార్గెట్లు, డెడ్‌లైన్ల వల్ల ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. దీనివల్ల చాలామంది యువత తక్కువ వయసులోనే బీపీ, షుగర్, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. కుటుంబానికి టైమ్ ఇవ్వలేక పర్సనల్ లైఫ్‌ను కూడా కోల్పోతున్నారు.

ఇండియాకు ఇది చాలా అవసరం:

మన దేశంలో కూడా ఈ 4 రోజుల పని విధానం వస్తే ఉద్యోగులకు 3 రోజులు ఫుల్ రిలాక్సేషన్ దొరుకుతుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి, మళ్లీ ఆఫీస్‌కు వెళ్లినప్పుడు రెట్టింపు ఉత్సాహంతో, ఎక్కువ ఫోకస్‌తో పని చేయగలుగుతారు. ఇక నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఐటీ రంగంలో, కార్పొరేట్ ఆఫీసుల్లో ఈ పద్ధతిని ఆలోచిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

వారానికి 4 రోజులు పనిచేయడం అనేది కేవలం లగ్జరీ కాదు, ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యానికి అది ఒక ఔషధం లాంటిది. ఇక భారతదేశంలో ఉన్న కాంపిటీషన్‌కు ఇది వెంటనే సాధ్యం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో కంపెనీలు ఈ దిశగా ఆలోచిస్తే ఉద్యోగుల ఆరోగ్యంతో పాటు కంపెనీల గ్రోత్ కూడా అద్భుతంగా ఉంటుంది అన్నది నిపుణుల మాట.

Tags:    

Similar News