పెళ్ళిళ్ళ సీజన్ మళ్ళీ స్టార్ట్ !

మంచి రోజులు వచ్చాయి. శుభ కార్యక్రమాలకు మళ్ళీ ముహూర్తలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా నేల రోజులుగా ఎక్కడా వివాహాది కార్యక్రమాలు అయితే లేవు.

Update: 2026-06-11 18:42 GMT

మంచి రోజులు వచ్చాయి. శుభ కార్యక్రమాలకు మళ్ళీ ముహూర్తలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా నేల రోజులుగా ఎక్కడా వివాహాది కార్యక్రమాలు అయితే లేవు. దీనికి అధిక జ్యేష్ఠ మాసం ఈసారి రావడం కారణం. నిజ జ్యేష్ఠ మాస అన్నది జూన్ 15 నుంచి మొదలవుతోంది. దాంతో జూన్ లో ఎక్కువగానే శుభ కార్యక్రమాలకు ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జూన్ నెలలో 19 నుంచి 30 వరకు పెళ్లిళ్లకు అనువైన రోజులు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. 21, 22, 23, 24, 25, 26, 27, 29 రోజులలో పెళ్ళిళ్ళకు మంచి ముహూర్త బలం అని పండితులు పేర్కొంటున్నారు.

ఈ ఏడాదిలో ఇవే :

ఇక జులైలో కొన్ని రోజులే ఉన్నాయని తెలుస్తోంది. అవి , 1, 2, 6, 7, 8, 11 తేదీలుగా పండితులు పేర్కొంటున్నారు. ఈ తేదీలు మాత్రమే వివాహాది శుభకార్యాలకు అనుకూలమని వెల్లడిస్తున్నారు. తర్వాత ఆగస్టులో 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 తేదీలలోనూ మంచి ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ ఏడాది చివరిలో చూస్తే కనుక నవంబర్ లో 21, 24, 25, 26 తేదీలు డిసెంబర్ లో 2, 3, 4, 5, 6, 11, 12 తేదీలు మంచి ముహూర్తం కలిగిన వివాహ ఘడియలుగా చెబుతున్నారు.

అతి పెద్ద మార్కెట్ గానే :

ఈసారి ఫిబ్రవరి నుంచి ఊపందుకున్న వివాహాలు మే 13 నుంచి ఒక్కసారిగా ఆగిపోయాయి. మధ్యలో అధిక జ్యేష్టం రావడమే దానికి కారణం. దాంతో పెళ్ళిళ్ళ సీజన్ కి సంబంధించిన మార్కెట్ అంతా కూడా ఆగిపోయింది. బ్యాండ్ మేళాలతో పాటు పురోహ్తిలు సైతం ఖాళీ అయిపోయారు. అలాగే పెళ్ళిళ్ల కోసం నిర్మించిన కళ్యాణ మండపాలూ బోసిపోయాయి. ఇపుడు మళ్ళీ ఒక పదిహేను రోజుల పాటు వాటికి కళ రానుందని అంటున్నారు. దేశంలో పెళ్ళిళ్ళ సీజన్ అన్నది అతి పెద్ద మార్కెట్ గానే అంతా చూస్తారు. ఎక్కడ లేని డిమాండ్ తో ఈ మార్కెట్ నడుస్తుంది. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది. అలాంటిది మళ్ళీ మొదలు కానుండడంతో అన్ని వర్గాలలో ఆనందం అయితే కనిపిస్తోంది. మరి ముందే ముహూర్తాలను నిర్ణయించుకున్న వారు అంతా పెళ్ళిళ్ళ కోసం తయారు కావాల్సిన శుభ తరుణం వచ్చినట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News